కూకట్‌పల్లి జోన్‌లో ఆలస్యంగా వెలుగులోకి అక్రమంగా బహుళ అంతస్థుల భవనాలు
నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్న జీహెచ్‌ఎంసి
పోలీసులకు ఫిర్యాదుతో సరిపెట్టిన అధికారులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: అక్రమ నిర్మాణాలు, అనుమతిలేని నిర్మాణాలపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన జీహెచ్‌ఎంసి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంద న్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొం దరి భవనాలను సీజ్ చేస్తూ.. మరికొందరి భవన నిర్మాణాలను చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుందనేది ప్రధాన విమర్శ. ము ఖ్యంగా అక్రమ నిర్మాణాల వల్ల ప్రజలు మోసపోకుండా ప్రచారం చేయాల్సిన, అ ట్టి నిర్మాణాలను సీజ్ చేయడం ద్వారా ఇ టు బిల్డర్లకు హెచ్చరికలు, అటు ప్రజల కు ముందస్తు జాగ్రత్తలను తెలియజేయాల్సిన జీ హెచ్‌ఎంసి ఆ విషయాన్నే విస్మరించిందని కొందరు కార్పొరేటర్లు అంటున్నారు. కూకట్‌పల్లి జోన్ లో ఏకంగా 5 అంతస్థులు, మూడంతస్థుల భవనాలు అక్రమంగా నిర్మిస్తున్నా జోనల్ అధికారులు ప్రేక్ష క పాత్ర పోషించడం పలు అనుమానాలకు తావిస్తుంది.
ఏకంగా అధికారుల సంతకాల ను ఫోర్జరీ, ఫ్యాబ్రికేటెడ్ చేసి భవన నిర్మాణ అనుమతుల మంజూరు పత్రాలను సృష్టించుకుని నిర్మిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టి చేతులు దులుపుకుంటుందే తప్ప ఇలాంటి ఫోర్జరీ సంతకాలతో మరేమైనా ఉన్నా యా..? అనేది విచారణ చేసే దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతో జోన ల్ అధికారుల తీరు నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఫోర్జరీ సంతకాలు.. అక్రమంగా నిర్మాణాలు
ముఖ్యంగా కూకట్‌పల్లి జోన్ కమిషనర్ నిర్లక్షం వల్లనే జోన్ పరిధిలో అనుమతులను అతిక్రమించి, అనుమతులను సృష్టించుకుని, అక్రమంగా నిర్మించుకుంటున్న నిర్మాణాలు, బహుళ అంతస్థుల భవనాలు వెలుస్తున్నట్టు ఆరోపణలు బలంగా ఉన్నాయి. గతంలో అల్వాల్ సర్కిల్ వెంకటాపురంలో స్టిల్ట్ +2 అంతస్థుల భవనానికి అనుమతులు తీసుకుని స్టిల్ట్+4 అంతస్థుల భవనం నిర్మిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నోడల్ అధికారికి లేఖ రాసినా జోనల్ కమిషనర్ చర్యలు కాదుకదా.. కనీసం ఆ నిర్మాణాన్ని ఆపలేదు. అల్వాల్ సర్కిల్ వెంకటాపురంలో వెలుస్తున్న భవనం యుసి 7319, షోకాస్ నోటీస్ తేదీ 12.07.2024న, స్పీకింగ్ ఆర్డర్ నోటీసు తేదీ 26.07.2024న, నోడల్ అధికారికి తేదీ 16.08.2024 నLtr.No.68/TPS/C-27/TPS/KPZ/GHMC/2024 అల్వాల్ డిప్యూటీ కమిషనర్ లేఖ రాశారు కానీ చర్యలు శూన్యం.
ఇప్పుడు బిల్డర్లు ఏకంగా అనుమతులను సృష్టించుకుని, అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి బహిరంగంగా కూకట్‌పల్లి జోన్ పరిధిలో హైదర్‌నగర్‌లోని సర్వే నెం. 145 పార్టులో రెండు బహుళ అంతస్థుల భవనాలు నిర్మాణం చేపట్టినా.. జోనల్ కమిషనర్ తమకేమి పట్టనట్టుగా వ్యవహరించడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కూకట్‌పల్లి జోన్‌లో హైదర్‌నగర్ సర్వే నెం. 145లో vide permit No.1/ C23/16219/2020 Dt: 29.10.2020 & 1/C23/1639/ 2020 Dt: 19.11.2020 లను తయారు చేసుకుని మరీ నిర్మాణాలను బిల్డర్లు చేపడుతుంటే పర్యవేక్షణ, తనిఖీలు జరపాల్సిన అధికారులు ఏం చేస్తున్నట్టు?.
ప్రజలను మభ్యపెడుతున్న జీహెచ్‌ఎంసి
ముందస్తు చర్యలు తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి పలువురు మరణిస్తున్నా.. జీహెచ్‌ఎంసి మేల్కోకపోవడం వెనుక నిర్లక్షమే ప్రధాన కారణమంటూ ప్రచారంలో ఉన్నది. గ్రేటర్ అధికారుల సంతకాలను ఫోర్జరీ, ఫ్యాబ్రికేట్ చేస్తూ అనుమతుల పత్రాలను సృష్టించుకుని నిర్మాణాలు వెలుస్తుంటే.. తస్మాత్ జాగ్రత్త..! ఇటువంటి భవనాల్లో ఫ్లాట్లను, భవనాలను కొనుగోలు చేయరాదనీ, పూర్తిగా విచారణ చేసుకోవాలని గానీ జీహెచ్‌ఎంసి నుంచి గత నెలరోజులుగా ఏలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ప్రజల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలకు తావిస్తుంది. ఈ భవనాలను సీజ్ చేశామని గానీ, ఆ నిర్మాణాలు నియమాలకు విరుద్ధంగా, చట్టాన్ని అతిక్రమించి చేసినవని గానీ బహిరంగ ప్రకటనల ద్వారా ప్రజలకు తెలియజేయకపోవడం వెనుక బిల్డర్లను అధికారులు కావాలనే వెనుకేసుకొస్తున్నట్టు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఫోర్జరీతో ఇటు అధికారులను, అటు ప్రజలను మోసం చేసిన ఆ బిల్డర్లపై బిల్డర్ల అసోసియేషన్‌కు లేదా క్రెడాయ్ వంటి సంస్థలకు సూచన చేయకుండా, ప్రజలకు బహిరంగ ప్రకటనలు చేయకుండా జీహెచ్‌ఎంసి మెతక వైఖరిని ఎందుకు అవలంభిస్తుందని కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు.
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కూకట్‌పల్లి జోన్ మూసాపేట్ సర్కిల్ పరిధిలోని సీబీసీఐడీ కాలనీలో 1900 చ. మీ.లు 1233 చ.మీ.లు ప్లాట్లలో భవనాలు నిర్మించడానికి అధికారుల సంతకాన్ని ఫోర్జరీ చేసి అనుమతులను సృష్టించుకున్నట్టు పత్రాలు తయారు చేశారని కెపిహెచ్‌బి పోలీసులకు డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు చేవారు. ఈ రెండు సైట్లల్లో భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. ఒక దాంట్లో 40 యూనిట్లు, మరో దాంట్లో 20 యూనిట్లతో భవనాలు నిర్మిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతం సర్వేనెంబర్ 145 ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్నదని అధికారులు గుర్తించారు. వైవీఆర్ కన్‌స్ట్రక్చన్స్ యజమాని వై వెంకటేశ్వర్‌రావు, శ్రీ అమేయా కన్ స్ట్రక్చన్స్ యాజమాని ఎన్. ప్రభాకర్ రెడ్డిలపై డిప్యూటీ కమిషనర్ వంశీ కృష్ణ ఫిర్యాదు చేశారు. దీంతో సదరు వ్యక్తులపై 420, 468 రెడ్ విత్ 34 ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేశారు.