Wednesday, December 25, 2024

15 క్వింటాళ్లకు పైగా నిషేధిత గంజాయి దహనం

- Advertisement -
- Advertisement -

భారీ ఎత్తున నిషేధిత గంజాయిని దహనం చేసినట్లు డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఛైర్మన్, సికింద్రాబాద్ రైల్వే ఎస్‌పి చందనా దీప్తి తెలిపారు. 2021 నుంచి 2023 మధ్య కాలంలో వివిధ రైల్వేస్టేషన్లలో పట్టుబడిన గంజాయిని యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండల, తొక్కాపురంలో రొమా కంపెనీలో దహనం చేశామని బుధవారం విలేకర్ల సమావేశంలో తెలిపారు. విడతల వారీగా సికిందరాబాద్, వరంగల్, కాచిగూడ, కాజీపేట, నిజామాబాద్, నల్లగొండ, హైదరాబాద్, వికారాబాద్, రైల్వేస్టేషన్ల పరిధిలో 15 క్వింటాళ్ల 75 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారని అన్నారు.

ఆ గంజాయి మొత్తాన్ని తూకం వేసి పంచనామా నిర్వహించిన అనంతరం దహనం చేశామని తెలిపారు. వివిధ రైల్వే పోలీస్ స్టేషన్ల పరిధిలో 52 గంజాయి కేసులు నమోదయ్యాయని తెలిపారు. వివిధ సందర్భాల్లో పట్టుబడిన నిందితుల వద్ద నుంచి సీజ్ చేశామని తెలిపారు. వీటి విలువ నాలుగు కోట్లు రూపాయలు ఉంటుందని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిషేధిత గంజాయిని దశల వారీగా విభజించి దహనం చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏసిపిలు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News