Monday, December 23, 2024

అఖిలపక్షం నాయకులపై అక్రమ కేసులను నిరసిస్తూ ప్లకార్డులతో నిరసన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: ప్రజా సమస్యలపై పోరాడుతున్న మోత్కూరు అఖిలపక్షం నాయకులపై తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అక్రమ కేసులు పెట్టించడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం నాయకులు శుక్రవారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అఖిలపక్షం నాయకులపై అక్రమ కేసులు పెట్టి నోటీసులు జారీ చేయడంతో వారంతా రామన్నపేట కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూరగాయల మార్కెట్ స్థలం కబ్జా కాకుండా, ఎమ్మెల్యే ఇచ్చిన ఇతర హామీల అమలు కోసం పోరాడితే 12 మంది అఖిలపక్షం నాయకులపై కేసులు పెట్టారని తెలిపారు.

Also Read: రూ. 360.40 కోట్లకు ముంబై గణేశుడి బీమా

ఎమ్మెల్యేకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని, కేసులు, రానున్న ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేకు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు పైళ్ల సోమిరెడ్డి, పైళ్ల యాదిరెడ్డి, అవిశెట్టి అవిలిమల్లు, గుండగోని రామచంద్రు, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, గడ్డం నర్సింహ, బయ్యని రాజు, బొల్లు యాదగిరి, కుకునూరు విష్ణువర్ధన్ రెడ్డి, మరాటి అంజయ్య, పుల్కరం మల్లేష్, సజ్జనం మనోహర్, బందెల రవి, గడ్డం లక్ష్మయ్య, కుర్మిళ్ల రాములు, అన్నెపు నర్సింహ, వంగరి రాములు, అన్నెపు రాములు, పోతరబోయిన లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News