Wednesday, January 22, 2025

బిజెపి శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారు : రఘునందన్‌రావు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలో తాము అధికార పార్టీ నేతలపై ఫిర్యాదులు చేస్తే.. ఆ పార్టీ నేతలు బిజెపి నేతలపై అక్రమ కేసులు పెట్టే కుట్ర చేస్తున్నారని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ను ఆయన కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధిపేట సిపి శ్వేత, ఎసిపిపై ఫిర్యాదు చేశామని వెల్లడించారు. అవినీతి కేసులో ఉన్న ప్రభుత్వ అధికారి ఎన్నికల ఉల్లాంఘనలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్‌లు పంచుతూ డబ్బులు వసూలు చేస్తున్న జిల్లాకు చెందిన నలుగురు అధికారులపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News