Wednesday, January 22, 2025

అక్రమ కేసులు ఎత్తివేయాలి

- Advertisement -
- Advertisement -
  • సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి

రంగారెడ్డి: భూ పోరాటంలో పాల్గొన్న సిపిఐ నాయకుల పైన అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడడం దుర్మార్గమని సీపీఐ జాతియ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్‌కు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ అబ్దుల్లాపూర్ మెట్టు, చేవెళ్ల లో ఇండ్ల స్థలాల కోసం గుడిసెల పోరాటం జరుగుతున్నదన్నారు.

రెండు చోట్ల భూ పోరాటంలో పాల్గొన్న సిపిఐ నాయకుల పైన పోలీసులు అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడడం బాధాకరమని ఆయన విమర్శించారు. రెవెన్యూ అధికారులు పోలీసులు భూ కబ్జాదారులతో కుమ్మకై గుడిసెలు వేసుకున్న భూదాన భూములను భూ కబ్జాదారులకు అనుకూలంగా చేయడం కోసం సిపిఐ నాయకుల పైన అక్రమ కుట్ర కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు అక్రమ కేసులను ఎత్తివేయాలని కలెక్టర్‌ను కోరారు. పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News