Monday, December 23, 2024

సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఆగని అక్రమ వసూళ్ల దందా

- Advertisement -
- Advertisement -

తాండూరు: తాండూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అక్రమ వసూళ్లు మొదలయ్యాయి. రోజురోజుకూ అవినీతి రాజ్యమేలుతోంది. సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఎసిబి దాడులు జరిపి నెలరోజులు కూడా కాకముందే అక్రమ వసూళ్ల దందా కొనసాగుతుందనే విమర్శలు వస్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్ పేరుకు తాను సత్యహరిచంద్రున్ని అని చెప్పుకుంటూనే అన్ని డాక్యూమెంట్లు ఉన్నా డబ్బులు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గత నెల 5న తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఎసిబి అధికారులు దాడులు జరిపి సబ్ రిజిస్ట్రార్ సమీరుద్దీన్‌తోపాటు డాక్యుమెంట్ రైటర్‌ను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుని జైలుకు తరలించారు. అయితే ఇంత జరిగినా తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో వసూళ్లు మాత్రం ఆగడం లేదన్న విమర్శలు వస్తున్నా యి.

అయితే స్లాట్ బుక్కింగ్ చేసుకున్న వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతి డాక్యుమెంట్‌కు రూ.500లకు తగ్గకుండా వసూళ్లు చేస్తున్నారు. అదే నాన్ స్లాటింగ్ అయితే రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వసూళ్లు చేస్తున్నార నే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో ఎక్కడ లేని విధంగా తాండూరులో రిజిస్ట్రేషన్లు కొనసాగుతుండటంతో సబ్ రిజిస్ట్రార్‌గా ఇక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నా రు. ఏసిబి దాడుల తరువాత శంషాబాద్‌లో పనిచేస్తున్న మునీర్ సిద్దిక్‌ను తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఇన్‌ఛార్జిగా పంపారు. తాండూరులో డబ్బు సంపద బాగా ఉండటంతో ఎక్కువగా ఇక్కడి వచ్చేందుకు అధికారులు ఆసక్తి చూపుతున్నారు. తాండూరుకు ఇన్‌ఛార్జిలు గా ఉండేందుకు కూడా పైరవీలు చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాండూరు ప్రాంతంలో రియల్ భూం కొనసాగుతుండటంతో ప్లాట్లు, భూముల రిజిస్ట్రేషన్లు ప్రతిరోజు కొనసాగుతున్నాయి.

అయితే దీన్నే ఆసరాగా తీసుకున్న సబ్ రిజిస్ట్రార్‌లు కొనుగోలు, అమ్మకం దారుల నుంచి ఇష్టానుసారంగా వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రిజిస్ట్రార్ చేసే సమయంలో అన్ని డాక్యుమెంట్లు ఉంటే ఒక రేటు…. ఏ ఒక్క డాక్యుమెంటు లేకపోయినా మరో రేటు చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై తాండూ రు సబ్ రిజిస్ట్రార్ మునిర్ సిద్దిక్‌ను వివరణ కోరగా తాను రూల్స్ ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని డాక్యుమెంట్లు ఉన్నా డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదు. తనపై ఆరోపణలు వస్తే తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోతానని, లేకపోతే లాంగ్ లీవు పెట్టుకుంటానని చెప్పుకొచ్చారు.
సమయానికి రాని సబ్‌రిజిస్ట్రార్
ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు రావాల్సిన తాం డూరు సబ్ రిజిస్ట్రార్ మునీర్‌సిద్దిక్ ఇష్టానుసారంగా వచ్చి వెళ్లుతున్నారు.
హైదరాబాద్ నుంచి వచ్చివెళుతుండటం తో విధులకు సక్రమంగా సమయానికి రావడం లేదని కొనుగోలు, అమ్మకందారులు వాపోతున్నారు. ఉదయం 12 గంటలకు రావడం వల్ల దూరప్రాంతాల నుంచి వచ్చిపోయేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వార ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ప్రశ్నించగా తనకు తాండూరు పనిచేసేందుకు అసలే ఇష్టం లేదని, బలవంతంగా పనిచేస్తున్నట్లు చెప్పడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News