Monday, December 23, 2024

మల్లాపూర్‌లో అక్రమ నిర్మాణాలు

- Advertisement -
- Advertisement -

బాలాపూర్:బడంగ్‌పేట్ కార్పొరేషన్ 18వ డివిజన్ పరిధిలోని మల్లాపూర్ రెవెన్యూ సర్వే.నెం:25లోని ప్రభుత్వ స్థ్ధలంలో భూకబ్జాదారులు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని స్థ్ధానికులు ఆరోపిస్తున్నారు.సుమారు రూ.2 కోట్ల విలువచేసే 30 గుంటల విస్తీర్ణం కలిగిన సదరు ప్రభుత్వ స్థ్ధలంలో భూ ఆక్రమణదారులు రాత్రికిరాత్రే అక్రమంగా ఇండ్లను నిర్మిస్తున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు మాత్రం వాటిని తొలగించడంలో తత్సారం వహిస్తునారని పలువురు ఆరోపిస్తున్నారు.15 రోజుల క్రితం ప్రభుత్వ స్థ్ధలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు భూకబ్జాదారులు ఇక్కడ అక్రమంగా చేపట్టిన నిర్మాణాలపై తాము ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారులు స్పందించి నిర్మాణాలను తొలగించినప్పటికీ కబ్జాదారులు తిరిగి అక్రమ నిర్మాణాలను చేపట్టారని,రెవెన్యూ అధికారులు తక్షణం వీటిని కూల్చివేయాలని కోరారు.అదేవిధంగా విలువైన ప్రభుత్వ స్థలాన్ని కడ్జాదారుల నుంచి కాపాడి ప్రజాఅవసరాల కోసం కేటాయించాలని ఈ సందర్భంగా పలువురు స్థ్ధానికులు రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News