Monday, December 23, 2024

శ్రీకృష్ణుడు గీత బోధ అనుసారమే అక్రమ నిర్మాణాలు కూల్చివేత: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శ్రీకృష్ణుడి గీత బోధ అనుసారమే ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చెరువుల ఆక్రమణదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారు ఉండడంతో పాటు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు, సమాజాన్ని ప్రభావితం చేసేవారు ఉన్నా కూడా తాను పట్టించుకోనని, ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చిన చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతానని హెచ్చరించారు. హరే కృష్ణ హెరిటేజ్ ఆధ్వర్యంలో అనంత శేష స్థాన ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

హైదరాబాద్ లేక్ సిటీ గండిపేట, ఉస్మాన్ సాగర్ భాగ్యనగర ప్రజల దాహార్తిని తీర్చుతున్నాయని, కొందరు ధనవంతులు చెరువుల పక్కనే ఫాంహౌస్ లు కట్టుకున్నారని, ఆ ఫాంహౌస్ నాలాలు గండిపేటలో కలిపారని తెలియజేశారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత భవిష్యత్ తరాల కోసం చేపట్టామన్నారు. హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

చెరువుల్లో అక్రమ నిర్మాణాలను వదిలేసేదే లేదని, రాజకీయంగా ఒత్తిడి వచ్చినా, మిత్రులకు ఫాంహౌస్లు ఉన్నా వదలి పెట్టనని స్పష్టం చేశారు. అక్రమణదారుల చెర నుంచి చెరువులకు విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చారు. అక్రమ కట్టడాలకు స్ఫూర్తి భగవద్గీతే అని, చెరువుల్లో శ్రీమంతులు ఫాంహౌస్లు కట్టుకున్నారని, వారి డ్రైనేజీని చెరువుల్లో కలుపుతున్నారని, రాజకీయ లబ్ధి, నాయకులపై కక్ష్య కోసం కూల్చివేతలు చేయడం లేదని రేవంత్ రెడ్డి తెలియజేశారు. అక్రమ నిర్మాణాలు వదిలేస్తే తాను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టేనని ఘాటుగా హెచ్చరించారు.  మణికొండలో అక్రమంగా నిర్మించిన విల్లాలు, మాదాపూర్ లో చెరువును కబ్జా చేసిన నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ హైడ్రా అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, హరే కృష్ణ హెరిటేజ్ ప్రతినిధులు,  అధికారులు, తదితరలు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News