Thursday, January 23, 2025

అక్రమ డెప్యుటేషన్లు రద్దు చేసి టీచర్లను స్కూళ్లకు పంపించాలి

- Advertisement -
- Advertisement -

విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంకు లోకల్ జిటిఎ విజ్ఞప్తి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎస్‌సిఇఆర్‌టిలో అక్రమ డెప్యుటేషన్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేసి పాఠశాలలోకి పంపించాలని లోకల్ క్యాడర్ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడోజు వీరాచారి రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంను కలిసి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా రాష్ట్రంలో అక్రమ డెప్యుటేషన్‌లో డైట్, డిఇఒ కార్యాలయాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల డెప్యుటేషన్లను రద్దుచేసి వారి వారి స్కూళ్లకు పంపించాలని కోరారు. అలాగే హైకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులందరినీ జిల్లా పరిషత్ స్కూళ్ల నుంచి రిఫాట్రియేషన్ చేయాలని కోరారు. తమ డిమాండ్లపై విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సానుకూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారని వీరాచారి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News