Wednesday, January 22, 2025

నిబంధనలకు విరుద్ధ్దంగా అక్రమ డ్రైనేజీ కనెక్షన్లు!

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్ : నిబంధనలకు విరుద్ధ్దంగా అక్రమ డ్రైనేజీ కనెక్షన్లు కలిపి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న జలమండలి అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. ఎల్బీనగర్ నియోజవకర్గంలో ప్రతి డి విజన్‌లో అక్రమ డ్రైనేజీ ,రోడ్డు తవ్వకాలు ,మురుగు ప రుగు పెడుతున్నా అధికారులు పెడ చెవిపెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మన్సూరాబాద్ డివిజన్ పరిధి లో సహారా రోడ్డు నుంచి సుష్మా ప్రధాన రహదారి సమీపాన బాలాజీనగర్ కాలనీలో అక్రమంగా రోడ్డు పగులగో ట్టి డ్రైనేజీ కనేక్షన్ కలుపుకున్నారు. నిబంధనల ప్రకారం జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ అధికారులు రోడ్డు కోలతల వే సి మార్కెట్ విలువ ప్రకారం జిహెచ్‌ఎంసికి డి.డి రూ పం లో చెల్లించాలి ,

దీంతో డి.డి చెల్లించిన అనంతరం జలమండలి అనుమతులు తీసుకోవాలి. దీంతో జలమండలి మేనేజర్ స్దాయి అధికారి డ్రైనేజీ ,తాగు నీటి కనేక్షన్ అన్‌లైన్‌లో అనుమతుల కోసం ధరఖాస్తు చేసుకోగా ,పరిశీలించి వాటికి ఛార్జీల నిమిత్తం జలమండలికి చెల్లించాలి . దీంతో జలమండలి అధికారులు పరిశీలించి కనెక్షన్ మంజూరు చేస్తారు. జలమండలి అధికారులు కాసులు తీసుకుంటుడంతో అక్రమంగా సెలవు దినాల్లో డ్రైనేజీ కనె క్షన్లు కలుపుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. శ్రీ రాంనగర్ కాలనీలో ఒక అపార్టు మెంట్‌లో 1/2 ఇంచ్ క నెక్షన్‌తో అక్రమంగా తాగు నీరు పోందుతున్న ఫిర్యాదు లు చేసిన పట్టించిన దాఖాలలు లేవని పలువురు అంటున్నారు.

నియోజవర్గంలో బహుళ అంతస్తులు ,వాణిజ్య భ వనాలు నిర్మాణాలు చేపడుతున్నారు. రెసిడెన్సియల్ అనుమతులు పోంది వాణిజ్య భవనాలు వినియోగిస్తున్న ప ట్టించుకొని యాంత్రగం ,వాణిజ్య భవనాలకు అక్రమం గా మురుగు నీరు కలిపి చేతి వాటం ప్రదర్శించి నిబంధనలు తుంగలో తోక్కేస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం లో పలు చోట్ల ఇలాంటి కోకోల్లలు ఉన్నాయని తెలుస్తోం ది. తాగు నీటి ,డ్రైనేజీ కనేక్షన్ జారీ చేయాలంటే ముడుపులు చెల్లిస్తే త్వరగా ఫైల్ ముందుకు పోతుంది ,లేనిచో నెల రోజుల పైగా కాలాయాపన చేయగా ,అధికారులను ప్రశ్నించగా సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. ఫైల్ ముందుకు వెళ్లలంటే కాసులు చెల్లిస్తే త్వరగా మంజూరు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.జలమండలి ఉన్న త స్థాయి అధికారులు ,విజిలెన్స్ అధికారులు దృష్టి సా రించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News