Sunday, December 22, 2024

ఆలయ భూముల్లో అక్రమ తవ్వకాలు నిలిపివేయాలి

- Advertisement -
- Advertisement -

కొమురవెల్లి: ఆలయ భూముల్లో అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని సిపిఎం మండల కార్యదర్శి శెట్టి పల్లి సత్తిరెడ్డి ఆరోపించారు. ఆదివారం సిపిఎం పార్టీ నాయకులతో కలిసి అక్రమ తవ్వకాలు జరుపుతున్న ఆలయ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లన్న భూములను కాపాడాల్సిన ఆలయ ఈవో పాలక మండలి చైర్మన్ కలిసి ఆలయ భూముల్లో విలువైన మట్టిని రోడ్డు కాంట్రాక్టర్‌ను తవ్వుకోమని పరోక్షంగా లభ్ధి పొందుతున్నారన్నారు. గతంలో గ్రామ అవసరాలకు ఆలయ భూములు మట్టి తవ్వకాలు జరిపితే హడావిడి చేసి కేసులు పెట్టించిన ఆలయ ఈఓ ప్రస్తుతం పట్టించుకోకపోవడంతో విషయం ఆర్ధం అవుతుందన్నారు.

ఆలయ అవసరాలకు ఉపయోగపడే దాసారం గుట్టను 6 కోట్లకు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తే నోరు మెదపని ఆలయ ఈవో పాలక మండలి చైర్మన్ గుట్టపై మంత్రి నిర్మించే 50 లక్షల విలు చేసే ప్రైవేట్ గెస్ట్ హాజ్‌కు 6 కోట్లతో రోడ్డునిర్మాణం చేపట్టడం వారి అసమర్ధ పాలనకు నిదర్శనమన్నారు. ఓ ఆలయ డైరెక్టర్ మట్టి కాంట్రాక్టర్ అవతారం ఎత్తిచ్చి ఆలయ సంపదను ముగ్గురు కలిసి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆలయ సంపద అక్రమంగా దోచుకుంటున్న మిగతా డైరెక్టర్లు ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే అక్రమ మట్టి తవ్వకాలు ఆపకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు బద్దిపడగ కృష్ణారెడ్డి, సనాది బాస్కర్, నాయకులు మేకల కృపాకర్, సార్ల యాదయ్య, ఆరుట్ల దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News