Monday, January 20, 2025

నోటిఫై చేయకుండానే నిషేధిత జాబితాలో జిపి లేఅవుట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :పంచాయతీ లే ఔ ట్‌లను నిషేధిత జాబితా చేర్చడంతో పాటు వా టి పై ఎలాంటి క్రయ, విక్రయాలు జరపరాదని పే ర్కొంటూ హెచ్‌ఎండిఎ తమ వైబ్‌సైట్‌లో పేర్కొం ది.ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలకు చెందిన లే ఔట్‌లకు సంబంధించిన జా బితాతో పాటు సర్వే నెంబర్‌లు, ఆ లే ఔట్‌ల యజమానుల పేర్లను ఈ జాబితాలో ప్రచురించింది. క నీసం తమకు ఎలాంటి సమాచారం లేకుండా ఆ జాబితాను హెచ్‌ఎండిఏ వెబ్‌సైట్‌లో ఎలా పొందుపరుస్తారని ఆయా లే ఔట్‌ల యజమానులు, డెవలపర్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కనీసం ముం దస్తుగా అభ్యంతరాలను స్వీకరించకుండానే హెచ్‌ఎండిఏ అధికారులు వెబ్‌సైట్‌లో ఈ జాబితా ను పెట్టారని, ఇలా అయితే తమ ప్లాట్లను ఎలా వి క్రయించాలని ఆయా లే ఔట్‌ల యజమానులు వా పోతున్నారు.

ప్రస్తుతం ఉమ్మడి మూడు జిల్లాలకు సంబంధించిన జాబితాను హెచ్‌ఎండిఏ అధికారు లు వెబ్‌సైట్‌లో పెట్టగా రానున్న రోజుల్లో మరికొ న్ని జిల్లాలకు సంబంధించి పంచాయతీ లేఔట్ ల జాబితాను అప్‌లోడ్ చేసే అవకాశం ఉందని అ ధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే హైడ్రా ఎఫెక్ట్ తో హెచ్‌ఎండిఎ పరిధిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఆదాయం పడిపోగా కొత్తగా హెచ్‌ఎండిఏ వెబ్‌సైట్‌లో ఈ జాబితాను పెట్టి తమను మరింత ఇబ్బందులకు గురిచేస్తుందని వారు వాపోతున్నారు. బుధవారం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు ప్రభుత్వం తరపున బిల్డర్‌లతో సమావేశం నిర్వహించి వారికి భరోసా కల్పించినా కొందరు అధికారులు తీసుకున్న నిర్ణయాల వల్ల బిల్డర్లు మరింత ఇబ్బందిపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు లే ఔట్‌ల యజమానులు, ప్రజలు వాపోతున్నారు.

ఇన్ని రోజులు లేని నిబంధన ఇప్పుడు ఎందుకు అమల్లోకి….
హెచ్‌ఎండిఏ తమ వెబ్‌సైట్‌లో పంచాయతీ లే ఔట్‌లకు సంబంధించి జాబితాను పెట్టడంతో క్రయ, విక్రయాలు ఆగిపోయాయని, దీనివల్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చాలావరకు రిజిస్ట్రేషన్‌లకు దెబ్బపడిందని పలువురు వాపోతున్నారు. 2020లో (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్) ఎల్‌ఆర్‌ఎస్‌ను అప్పటి ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినప్పుడు దానికి సంబంధించిన విధి, విధానాలను ప్రకటించింది. గ్రామపంచాయతీ లే ఔట్‌లయినా అప్పటికే రిజిస్ట్రేషన్ అయి ఉంటే వాటిని యధావిధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, అయినా ఎల్‌ఆర్‌ఎస్ కట్టుకోవాలని, ఒకవేళ ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కానీ, ప్లాట్‌లకు మాత్రం రిజిస్ట్రేషన్ చేయవద్దని అప్పటి ప్రభుత్వం విధి, విధానాల్లో ప్రభుత్వం పేర్కొంది. తదనంతరం ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ కట్టుకొని వాటిని కొందరు యజమానులు విక్రయించగా ప్రస్తుతం వాటికి కూడా రిజిస్ట్రేషన్ చేయవద్దని హెచ్‌ఎండిఏ ఈ వైబ్‌సైట్‌లో పేర్కొనడం గమనార్హం. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిన పంచాయతీ లే ఔట్‌లోని ప్లాట్లను కూడా నిషేధిత జాబితాలో పెడితే తాము ఎలా దానిని విక్రయించాలని ప్లాట్ల యజమానులు వాపోతున్నారు. తమకు, లే ఔట్‌ల యజమానులకు సంబంధం ఏమీ ఉంటుందని, ఎప్పుడో తాము లే ఔట్ యజమాని నుంచి ప్లాట్లను కొనుగోలు చేశామని ఇన్ని రోజులు లేని నిబంధనలను ఎందుకు అమల్లోకి తీసుకొచ్చారని ఆయా ప్లాట్ల యజమానులు ప్రశ్నిస్తున్నారు.

స్క్రూటీని జరుగుతుండగానే…
ఇప్పటికే పంచాయతీ లే ఔట్‌లు చేసిన లే ఔట్‌ల యజమానులు అమ్మకుండా మిగిలిన ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఫీజును 2020లో చెల్లించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను స్క్రూటీని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు పురపాలక శాఖ, హెచ్‌ఎండిఏలు దీనికోసం తగినంత సిబ్బంది నియమించి ఆయా లే ఔట్‌ల యజమానులకు నోటీసులు సైతం జారీ చేయడంతో పాటు షాట్‌ఫాల్స్ లిస్ట్‌ను సైతం ఆయా యజమానులకు పంపించారు. ఇలా స్క్రూటీని జరుగుతుండగానే హెచ్‌ఎండిఏ వైబ్‌సైట్‌లో గ్రామ పంచాయతీల లే ఔట్‌లకు రిజిస్ట్రేషన్‌లు చేయవద్దని హెచ్‌ఎండిఏ సూచించడం, వాటిని నిషేధిత జాబితాలో చేర్చడంపై ప్రజలు, లే ఔట్‌ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తూరు, ఫరూఖ్‌నగర్
మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తూరు, ఫరూఖ్‌నగర్ మండలాల్లోని గ్రామ పంచాయతీ లే ఔట్‌లు అధికంగా ఉన్నాయని, వాటికి సంబంధించి క్రయ, విక్రయాలు జరపొద్దని హెచ్‌ఎండిఏ ఈ వెబ్‌సైట్‌లో సూచించింది. దీంతోపాటు ఆయా లే ఔట్‌లకు సంబంధించిన సర్వే నెంబర్‌లతో పాటు ఆయా లే ఔట్‌ల యజమానుల పేర్లను సైతం అందులో పొందుపరచడం విశేషం.
మెదక్ జిల్లాలోని పటాన్‌చెరు మండలంలో…
ఇక మెదక్ జిల్లాలోని పటాన్‌చెరు మండలంలో అధికంగా 65 జిపి లే ఔట్‌లు ఉండగా అమీన్‌పుర్, కిష్టారెడ్డిపేట్, సుల్తాన్‌పూర్, పోచారం, పటేల్‌గూడ, చిత్‌కుల్, కర్ధనూర్, ఇంద్రేశం, ఆర్‌సి పురం గ్రామాల్లో ఈ లేఔట్‌లు అధికంగా ఉన్నాయని హెచ్‌ఎండిఏ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

రంగారెడ్డి జిల్లాలోని 13 మండలాల్లో….
ఇక రంగారెడ్డి జిల్లాలోని 13 మండలాల్లో (సరూర్‌నగర్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, మహేశ్వరం, కందుకూర్, చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, రాజేంద్రనగర్, శామీర్‌పేట్, కీసర, ఘట్‌కేసర్) తదితర మండలాల్లోని వందల లే ఔట్‌లను నిషేధిత జాబితాలో హెచ్‌ఎండిఏ అధికారులు చేర్చడం విశేషం. ప్రస్తుతం రంగారెడ్డి, మెదక్‌కు సంబంధించి హెచ్‌ఎండిఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆదాయం గణనీయంగా పడిపోయిందని సబ్ రిజిస్ట్రార్‌లు పేర్కొంటున్నారు.

హెచ్‌ఎండిఏ పరిధిలోని 719 గ్రామ పంచాయతీల్లో
ప్రస్తుతం హెచ్‌ఎండిఏ పరిధిలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో దరఖాస్తులను ఆయా పట్టణ ప్రణాళిక విభాగాలే పరిష్కరించనున్నాయి. అయితే, హెచ్‌ఎండిఏ పరిధిలోని 719 గ్రామ పంచాయతీల్లో మాత్రం వాటిని పరిష్కరించే వ్యవస్థ లేదు. అందుకే ఆ బాధ్యతను హెచ్‌ఎండిఏకు ప్రభుత్వం అప్పగించింది. ఆయా పంచాయతీల నుంచి నాలుగు లక్షల దాకా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వీటిని పరిష్కరించే క్రమంలో భాగంగా దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటుచేసిన ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను హెచ్‌ఎండిఏకు అనుసంధానించారు. ఏడు జిల్లాల పరిధిలో 7,257 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్న హెచ్‌ఎండిఏ పరిధిలోని 70 మండలాలు, 32 దాకా మునిసిపాలిటీలు, ఎనిమిది కార్పొరేషన్లు ఉన్నాయి. 2008లో ఎల్‌ఆర్‌ఎస్‌ను అమల్లోకి తీసుకొచ్చినప్పుడు హెచ్‌ఎండిఏకు 50వేల వరకు దరఖాస్తులు రాగా, 2015లో 1,61,649 దరఖాస్తులు, 2020లో సుమారుగా 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News