రాజంపేట: దోమకోండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని దోమకోండ, బీబీ పేట, బిక్కనూర్, రాజంపేట, తాడ్వాయి మండలాలలోని గ్రామాలలో అనుమతి లేకుండా మద్యం విక్రయాలు నిర్వహింస్తే కఠిన చర్యలు ఉంటాయని దోమకోండ ఎక్సైజ్ స్టేషన్ ఎస్సై పోతిరెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. వివిద గ్రామాలలో అక్రమంగా మద్యం అమ్ముతుండగా 2022 సంవత్సరానికి అనేక కేసులు నమోదు చేశామని అందుతున్న ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహిస్తున్నామన్నారు.
ఇప్పటివరకు 8 కేసులు నమోదు చేశామని (31.24 లీటర)ల మద్యం,(11.7) లీటర్ల బీరులను స్వాదీనం చేసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఎనిమిది మందిపై కేసులు చేసి ఆరెస్టు చేశామని పేర్కొన్నారు. గ్రామాలలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచుకున్న అమ్మిన చట్టరిత్య నేరమని ఈ విషయాన్ని అయ మండలాల, గ్రామాల ప్రజలు గమనించాలని ఎక్కడైన అక్రమంగా మద్యం విక్రయాలు జరిగితే తమకు సమాచారం ఇవ్వాలని వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని సూచించారు.