Sunday, January 19, 2025

ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలింపు

- Advertisement -
- Advertisement -

బిచ్కుంద: బిచ్కుంద మండలంలోని ఖత్‌గాం, శెట్లూర్, హజ్గుల్, పుల్కల్ తదితర గ్రామాల మంజీరా పరీవాహక ప్రాంతాల నుంచి రాత్రి సమయంలో సుమారు 50కు పైగా ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. కాగా, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారా, మరెక్కడైనా నిర్వహిస్తున్నారా ? లేక అంతా తెలిసే జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ల యజమానులు సైతం సంబంధిత అధికారులు తెర వెనుక అమ్యామ్యాలు ముట్టజెప్పి నడుపుకుంటున్నామని చెబుతుండటం గమనార్హం. కాగా, శనివారం రాత్రి తహసీల్దార్ అక్రమంగా మంజీరా నుంచి ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లను పట్టుకుని తదుపరి చర్యల నిమిత్తం బాన్సువాడ ఆర్డీవోకు సమాచారం అందించినట్లు తెలిపారు.

గత కొన్ని రోజులుగా తహసీల్దార్ సెలవులో ఉండటంతో స్థానిక సంబంధిత రెవెన్యూ, పోలీస్ అధికారులు ఈ తతంగం జరిపారనే ఆరోపణలున్నాయి. కాగా, అంతా తెలిసే అక్రమ ఇసుక, ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్లు, బోలెరో వాహనాల్లో నడిపేందుకు సహకరిస్తున్నారని సమాచారం. కాగా, పెట్రోలింగ్ చేస్తున్న సంబంధిత అధికారులకు కూడా తెలియకుండానే జరుగుతుందా అని పలువురు స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా నివారించేందుకు ప్రత్యేక టీంలను పంపాలని జిల్లా అధికారులకు తహసీల్దార్ కోరినట్లు సమాచారం. ఇప్పటికైనా అక్రమ ఇసుక ఆగేనా లేక షరా మాములుగానే కొనసాగేనా వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News