Sunday, September 8, 2024

అక్రమంగా ఇన్సులిన్ అమ్మకాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అక్రమంగా ఇన్సులిన్ అమ్మకాలు కొనసాగిస్తున్న వారిపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డిసిఎ) కొరడా ఝుళిపించింది. కొనుగోలు బిల్లులు లేకుండా అక్రమంగా ఇన్సులిన్ ఇంజెక్షన్లు కొనుగోలు చేసిన ఆరుగురు మెడికల్ హోల్‌సేల్ వ్యాపారుల లైసెన్సులను 30 రోజుల పాటు డిసిఎ సస్పెండ్ చేసింది. రూ.51.92 లక్షల విలువైన నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు మార్చి 15 నుంచి మార్చి 20 మధ్య హైదరాబాద్‌లోని ఆరు మెడికల్ డిస్ట్రిబ్యూటర్లపై డిసిఎ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఇన్సులిన్ ఇంజెక్షన్లను 40 శాతానికి మించి రాయితీపై విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కొనుగోలు బిల్లులు లేకుండానే ఈ ఇంజెక్షన్లు న్యూఢిల్లీ నుంచి వచ్చాయి. ఈ దాడుల్లో డిసిఎ రూ.51.92 లక్షల విలువైన నిల్వలను స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940ని ఉల్లంఘించే కొనుగోలు బిల్లులు లేకపోవడం వల్ల ఇన్సులిన్ ఇంజెక్షన్‌లపై గణనీయమైన తగ్గింపును అందిస్తున్నట్లు టోకు వ్యాపారులు గుర్తించారు.

కొను గోలు బిల్లులు లేకుండా నిల్వ ఉంచిన సికింద్రాబాద్‌లోని మెస్సర్స్ డ్రగ్ హబ్ నుంచి రూ.6.70 లక్షలు, రామంతాపూర్, ఉప్పల్‌లోని శ్రీ తిరుమల ఫార్మా నుంచి రూ.3.52 లక్షలు, హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్‌లోని శ్రీ పరాస్ మెడికల్ ఏజెన్సీ నుంచి రూ. 9 లక్షలు, – మేడ్చల్-మల్కాజి గిరి జిల్లాలో శ్రీ గణేష్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ రూ. 14 లక్షలు, – కాప్రాలోని శ్రీరాజ రాజేశ్వర డిస్ట్రిబ్యూటర్లు నుంచి రూ. 2.70 లక్షలు,- హైదరా బాద్‌లోని కాచిగూడలోని శ్రీ బాలాజీ ఏజెన్సీస్ రూ. 16 లక్షలు విలువైన స్టాక్‌ను డిసిఎ అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల ఔషధాల నాణ్యత, ప్రామాణికత, భద్రతను ధృవీకరించడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు, పైపెచ్చు ఇది వినియోగదారులకు ప్రమాదాలను కలిగించే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News