Friday, December 20, 2024

అక్రమంగా ఇసుక తవ్వకాలు: కొమ్మాలపాటి

- Advertisement -
- Advertisement -

పల్నాడు: ఇసుక అక్రమ తవ్వకాలపై తాము ప్రశ్నించామని టిడిపి నేత, మాజీ ఎంఎల్‌ఎ కొమ్మాలపాటి శ్రీధర్ తెలిపారు. వైసిపి ప్రభుత్వం నిబంధనలను పాటించడం లేదని చెప్పామని, ఇసుక అక్రమ తవ్వాకాలపై చర్చకు రావాలని వైసిపి ఎంఎల్‌ఎ శంకర్రావుకు శ్రీధర్ సవాల్ విసిరామన్నారు. అమరావతిలోని అమరేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేస్తామని సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయం వద్ద ఇరు పార్టీల కార్యకార్తలు చేరుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. ఈసందర్భంగా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు.

ఎంఎల్‌ఎ శంకర్రావు సవాల్‌ను స్వీకరించామని స్పష్టం చేశారు. టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసిపి ఏం చేయలేదని, దీనిపై చర్చ జరిపేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. అమరావతిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని కొమ్మలపాటి విమర్శించారు. నదిలో తవ్విన గోతుల వల్లే అనేక మంది చనిపోతున్నారని దుయ్యబట్టారు. టిడిపి పాలన నాటి అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇసుక దోపిడీ, మట్టి మాఫియా, ఇళ్ల నిర్మాణంపై చర్చకు సిద్ధం అని సవాలు విసిరారు. వైసిపి పాలనతో ఎక్కడా అభివృద్ధి జరగలేదని విమర్శలు గుప్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News