Saturday, November 23, 2024

తప్పుడు పత్రాలతో ఇసుక దోపిడీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తప్పుడు పత్రాలతో కొందరు అక్రమార్కులు ఇసుకను దోచేశా రు. వాటర్‌బోర్డుకు సంబంధించి పనుల కోసం ఇసుక కావాలంటూ లక్షా 40 వేల మెట్రిక్ ట న్నుల ఇసుకను కొందరు అక్రమార్కులు అధికారులతో కలిసి అప్పనంగా అమ్ముకున్నారు. కొం దరు చేసిన ఈ అవినీతి వల్ల సుమారుగా 100 నుంచి 150 మంది లారీల యజమానులు తమ డబ్బులను ఇప్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చే స్తుండడం విశేషం. ప్రతిరోజు ఇసుక డిడిలను టి జిఎండిసి ఇసుక లారీల కోసం ప్రతిరోజు అరగంట పాటు అందుబాటులో ఉంచుతుంది. మా ములుగా ప్రతిరోజు ఇసుక డిడిలను ప్రభుత్వం అందుబాటులో పెట్టినప్పుడు ఒక లారీ యజమానికి ఒక ఇసుక డిడి వస్తే, మరోసారి ఆ లారీ యజమానికి ఇసుక డిడి కావాలంటే వారం నుంచి పదిరోజులు సమయం పడుతుంది. ఇలా ఇసుక డిడిల దందా జరగకుండా రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఆన్‌లైన్ వ్యవస్థలో అనే క మార్పులు చేసింది. గతంలో ఇలాగే కొందరు అక్రమార్కులు టిజిఎండిసిని తప్పుదారి పట్టించడంతో రెండు సంవత్సరాల క్రితం ఆన్‌లైన్ వ్యవస్థలో పలుమార్పులు చేయడంతో పాటు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన పేపర్లు నకిలీవా కాదా అ న్న విషయాలను పరిశీలించాకే వారికి ఇసుక డిడిలను మంజూరు చేస్తోంది.

నెలక్రితం వరకు ఎండిగా పనిచేసిన
దీంతోపాటు పెద్ద పెద్ద బిల్డింగ్‌లు నిర్మాణం చేసే బిల్డర్‌లకు టిజిఎండిసి నుంచి ఇసుక కావాలం టే ఆ నిర్మాణాలకు సంబంధించిన ప్రతి లింక్ డ్యాక్యుమెంట్‌తో దానికి సంబంధించిన అనుమ తి పత్రాలను టిజిఎండిసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే టిజిఎండిసి ఎండి గా నెలక్రితం వరకు పనిచేసిన ఓ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ప్రస్తుత జిఎంగా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి ఈ ఇసుకకు అనుమతులు ఇ చ్చినట్టుగా తెలిసింది. ఈ ఇసుక అనుమతుల్లో నూ భారీగా అవినీతి జరిగిందని, అధికారులు కోటి రూపాయల వరకు వసూళ్లు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి దీనిపై ప్ర భుత్వానికి ఫిర్యాదులు అందినట్టుగా సమాచారం. తప్పుడు పత్రాలతో ఈ ఇసుక కోసం ద రఖాస్తు చేసుకున్న వారు వాటర్‌బోర్డుకు సంబంధించిన పనుల చేయడానికంటూ వాటర్‌బోర్డుకు సంబంధించిన పేపర్‌లను ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయగా నెలక్రితం వరకు పనిచేసిన టిజిఎండిసి ఎండిగా, (ప్రిన్సిపల్ సెక్రటరీ) పని చేసిన అధికారితోపాటు ప్రస్తుత జిఎం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన పత్రాలను పరిశీలించకుండానే లక్షా 40వేల మెట్రిక్ టన్నుల ఇసుకకు అనుమతులు ఇచ్చినట్టుగా తెలిసింది.

వాటర్‌బోర్డులోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేరుతో….
అయితే తప్పుడు పత్రాలతో లక్షా 40 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను కొనుగోలు చేసిన అక్రమార్కులు ఈ ఇసుక కోసం సుమారుగా రూ.4కోట్ల పైచిలుకు టిజిఎండిసికి చెల్లించినట్టుగా తెలిసింది. అక్రమార్కులకు అనుమతులు రాగానే వాటిని కొందరు లారీ డ్రైవర్‌లకు, లారీల యజమానులకు ఇచ్చి ఆ డిడిలను అధికధరలకు విక్రయించుకోవాలని తమ కమీషన్ తమకు ఇవ్వాలని అక్రమార్కులు వారికి సూచించినట్టుగా తెలిసింది. అయితే ఇప్పటికే ఇందులో నుంచి 40 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను లారీల యజమానులు అధిక ధరకు విక్రయించుకున్నట్టుగా సమాచారం. ఈ ఇసుకరీచ్‌లు కూడా జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, భద్రాచలం, ములుగు జిల్లాలకు సంబంధించినవి కావడం విశేషం. ఈ ఇసుకరీచ్‌ల్లో లభ్యమయ్యే ఇసుకకు అధిక ధర పలుకుతుండడంతో అక్రమార్కుల ఇచ్చిన డిడిలను లారీల యజమానులు హాట్‌కేకుల్లాగా కొనుగోలు చేసినట్టుగా తెలిసింది. ఇలా ఇసుక డిడిలను విక్రయిస్తున్న సమయంలోనే అసలు ఇన్ని ఇసుక డిడిలు అక్రమార్కులకు ఎలా వస్తున్నాయని కొందరు లారీల యజమానులు ఆరా తీశారు. దీంతోపాటు ఆ డిడిలకు సంబంధించిన ఐపి అడ్రస్ ఆధారంగా వాటర్‌బోర్డుకు సంబంధించిన కాగితాలు ఉన్నాయని అందులో ఒక అధికారి (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) పేరు ఉండడంతో లారీల యజమానులు ఈ విషయాన్ని వాటర్‌బోర్డులో పనిచేసే ఆ అధికారికి తెలియచేశారు.

రూ.5 నుంచి రూ.10 కోట్లు వసూళ్లు
లారీల యజమానుల ఫిర్యాదుతో వాటర్‌బోర్డులో పనిచేసే ఆ అధికారి టిజిఎండిసి లేఖ రాశారు. తమ వాటర్‌బోర్డు ఐపి అడ్రస్ ఆధారంగా మంజూరు చేసిన ఇసుకను బ్లాక్ చేయాలని ప్రస్తుతం టిజిఎండిసికి వినతిపత్రం అందించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన టిజిఎండిసి అధికారులు ఆ ఐపి అడ్రస్ మీద మంజూరు చేసిన ఇసుకను విక్రయించకుండా బ్లాక్ చేసింది. దీంతో అక్రమార్కుల వద్ద నుంచి డిడిలను కొనుగోలు చేసిన సుమారు 100 నుంచి 150 మంది లారీల యజమానులు టిజిఎండిసి కార్యాలయానికి రావడంతో అసలు మోసం బయటపడింది. అయితే ఇప్పటికే అక్రమార్కులు సుమారుగా లక్షా 40 వేల మెట్రిక్ టన్నుల ఇసుకకు సంబంధించిన డిడిలను లారీల యజమానులకు విక్రయించి రూ.5 నుంచి రూ.10 కోట్లను వసూలు చేసినట్టుగా వినికిడి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన టిజిఎండిసి మిగిలిన లక్ష మెట్రిక్ టన్నుల ఇసుకను రీచ్‌ల నుంచి తీసుకోకుండా బ్లాక్ చేయడంతో తాము చెల్లించిన డబ్బులు ఇవ్వాలని లారీల యజమానులు టిజిఎండిసి అధికారులను డిమాండ్ చేస్తున్నట్టుగా తెలిసింది.

ప్రభుత్వానికి లారీల యజమాలను ఫిర్యాదు
అయితే వాటర్‌బోర్డు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే తాము ఇసుకను తీసుకోకుండా నిలిపివేశామని ఒకవేళ బ్లాక్‌ను తొలగించాలంటే వాటర్‌బోర్డు నుంచి ఎన్‌ఓసిని తీసుకురావాలని టిజిఎండిసి అధికారులు లారీల యజమానులతో పేర్కొనట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే లారీల యజమానులు వాటర్‌బోర్డుకు వెళ్లి ఆ అధికారికి జరిగిన విషయాన్ని తెలపగా ఇప్పటికే తమ సంస్థ పేరుతో 40 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను వాడుకున్నారని, ఆ ఇసుకను తమకు తిరిగి ఇచ్చేయాలని ఆయన లారీ యజమానులతో పేర్కొన్నట్టుగా తెలిసింది. దీంతో ప్రస్తుతం తాము డబ్బులు చెల్లించి తీసుకున్న డిడిలకైనా డబ్బులను తిరిగి ఇప్పించాలని లారీల యజమానులు వేడుకున్నట్టుగా సమాచారం. ఇది తమ పరిధిలోని విషయం కాదనీ ఇరు శాఖల అధికారులు లారీల యజమానులతో పేర్కొన్నట్టుగా తెలిసింది. దీంతో ప్రభుత్వానికి లారీల యజమానులు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News