Friday, December 27, 2024

నేతల అండతో మూసీ వాగులో ఇసుక అక్రమ రవాణా

- Advertisement -
- Advertisement -

అర్వపల్లి : ఇసుక రవాణ ద్వారా భూగర్బ జలాలు అడుగంటి పోతున్న అధికారులు ప్రజా ప్రతినిధుల అండ వలన జాజిరెడ్డిగూడెం మూసీ వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణ జరుగుతుంది. ఎలాంటి అనుమతి లేకుండా వివిధ కంపెనీ కట్టడాల పేరుతో 8 క్వారీల ద్వారా ఇసుక రవాణ చేస్తున్న కూడా పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని జాజిరెడ్డిగూడెం గ్రామస్థులు గురువారం అడ్డుకొని ధర్నా చేపట్టారు. వెంటనే ఇసుక క్వారీలను రద్దు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. జాజిరెడ్డిగూడెం ఇసుక రవాణా అనుమతి కాకుండా వంగమర్తి పేరుతో ఇసుక రవాణా చేస్తు జాజిరెడ్డిగూడెం మూసీ వాగు ద్వారా నిత్యం వందలాది లారీలతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు.

ఈ సంధర్బంగా గ్రామస్థులు మాట్లాడుతు గ్రామంలో ఎలాంటి పనులు లేకుండా ఇబ్బంది పడుతున్నామని గ్రామస్థులకు పని కల్పించాలని ట్రాక్టర్‌ల ద్వారా ఇసుక రవాణా చేసినట్లయితే గ్రామస్థులకు ఉపాధి దొరుకుతుందని దీనితో పాటు లారీలకు కూడా కూలీలుగా చేస్తామని అనుమతి ఉన్న ట్రాక్టర్‌లతో మాత్రమే ఇసుక రవాణా చేయనున్నట్లు వారన్నారు. నిత్యం ఇసుక రవాణా చేయడం ద్వారా భూగర్బజలాలు అడుగంటి తమ పొలాలు ఎండి పోతున్నాయని గ్రామస్థులు వాపోయారు. దీంతో పాటు నిత్యం రద్దీగా ఉండే తానం చర్ల జాతీయ రహదారి పై వందలాది లారీలు అడ్డుగా ఉండి తమ పోలాలకు, బావి దగ్గరకు వెళ్లాలంటే నిత్యం గొడవలు జరుగుతున్నాయని ప్రయాణికులకు ఇబ్బంది కరంగా ఉందని మహిళలు వ్యవసాయ వెళ్లాలంటే ఇబ్బంది కరంగా ఉందని గ్రామస్థులు వాపోయారు.

దీంతో పాటు ఇసుక రవాణా ట్రాక్టర్‌ల ద్వారానే తరలించాలని తానంచర్ల జాతీయ రహదారిపై మహిళలు, రైతులు, కూలీలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ధర్నా నిర్వహించారు. ఇసుక లారీలు వే బిల్లు లేకుండా జీరో దంధాతో 50నుండి 60 టన్నుల అధికలోడు ఇసుకతో ప్రయాణిస్తున్న ఇసుక లారీల ద్వారా గతంలో కొత్తగూడెం రోడ్డు అస్తవ్యస్తంగా మారిపోయిందని ప్రజలు వాపోయారు. దీంతో పాటు మూసీ వాగులో పశువులను మేపడానికి వెళ్లవలసి వస్తే ఎక్కడ ఇసుక గుంతలు ఉన్నాయో, ఎక్కడలేవో అర్థం కావట్లేదని ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియట్లేదని గ్రామస్థులు వాపోయారు. పది జేసిబిల ద్వారా ఇసుక రవాణా చేస్తున్న వారిపై చర్యలు చేపట్టి ఉపాధి కూలీలకు పని కల్పించాలని జాజిరెడ్డిగూడెం గ్రామస్థులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు , నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News