Sunday, January 19, 2025

మద్యం అక్రమ రవాణాను అరికట్టాలి

- Advertisement -
- Advertisement -

గద్వాల ప్రతినిధి: ఇతర రాష్ట్రా ల నుంచి జిల్లాలోకి వచ్చే గోవా, కర్ణాటక లిక్కర్‌ను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ పకడ్భందీగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అదనపు కమీషనర్ అజయ్‌రావు అన్నారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా సరిహద్దులోని నందిన్నె ఎక్సైజ్ శాఖ చెక్‌పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక, గోవా, తదితర రాష్ట్రాల నుంచి అక్రమంగా మ ద్య ం రవాణా అవుతున్న నేపథ్యంలో నందిన్నె, బల్గెర చెక్‌పోస్టులో పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలన్నా రు. అనుమానస్పదంగా తిరిగే వాహనాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తి నిఘా ఉంచాలన్నారు.

నకిలీ మద్యం విక్రయాలు అరికట్టడానికి అధికారు లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటి కమీషనర్ దత్తురాజ్, జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ సైదులు, టాస్క్‌ఫోర్స్, డీటీఎఫ్, ఎక్సైజ్ ఎస్‌ఐలు, అధికారులు, సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News