Sunday, December 22, 2024

క్రమం తప్పకుండా అక్రమాలపై వేటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కొండాపూర్: అక్రమ నిర్మాణలను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని శేరిలింగంపల్లి రెవెన్యూ అ ధికారులు అన్నారు. సోమవారం శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలోని కొండాపూర్ డివిజన్‌లోని రాయదుర్గం డ్ క్యాప్ స్థలం సర్వే నెంబర్1నుండి 41లలో వెలసిన అక్ర మ నిర్మాణలను గుర్తించిన రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు ఉదయం నుంచి కూల్చివేతలను ప్రారంభించారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన భవనాలు సు మారుగా ఒక ఎకరం స్థలంలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు భారీ పోలీస్ బందోబస్త్‌ల మధ్య కూల్చివేతలను ప్రా రంభించారు. ఇంట్లో ఉన్న వారిని బయటికి పంపించి ఇం టిని కూల్చివేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇంట్లో ఉన్న వస్తువులను బయటపడేసి కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని బాధితులు వాపోయారు. గత 40 సంవత్సరాలుగా ఇక్కడే ఇల్లు కట్టుకొని జీవనం సాగిస్తున్న

తమపై కక్షగట్టినట్టుగా ఇండ్లను కూల్చివేయడంతో పిల్లలతో ఇప్పుడు ఎక్కడ ఉండాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బసిరత్ అలీఖాన్ కుటుంబంతో పాటు మ రో రెండు కుటుంబాలు వంశపార్యపరంగా వచ్చిన భూమి లో నిర్మించిన ఇంటిలో ఉంటున్నారు. కాగా సోమవారం ఉదయం జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, లిడ్‌క్యాబ్, టీఎస్‌టీపీసీ అధికారులు సిబ్బందితో కలిసి నిద్రలో ఉన్న కుటుంబాలను కట్టుబట్టలతో పోలీసులతో కలిసి అదుపులోకి తీసుకుని యంత్రాల సహాయంతో ఇండ్లను కూల్చివేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, కుటుంబసభ్యులంతా కలిసి వేడుకుంటున్నా వినకుండా కూల్చివేశారు. ప్రైవేట్ సర్వే నెంబర్లను ప్రభుత్వ భూములంటూ తమ అధీనంలోకి తీసుకుంటున్నట్లు హెచ్చరించారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో చిన్న పిల్లలతో కలిసి కూలిన ఇండ్లను చూసుకుంటూ అక్కడే ఉండిపోయారు.

హైకోర్టు స్టేటస్ కో ఉందంటున్నా అధికారులు కనీసం కనికరం చూపకుండా ప్రవర్తించిన తీరుకు అక్కడున్న వారు అవాక్కయ్యారు. 37.08 ఎకరాల భూమి హైదరాబాద్ టెన్నరీస్ సంస్థ. శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం సర్వే నెంబర్ 1 నుంచి 41వరకు ఉన్న ప్రైవేట్ భూమి 37.08 ఎకరాలు హైదరాబాద్ టెన్నరీస్‌కు చెందినదిని, దాని పూర్తి హక్కులు తమ వంశపార్యపరంగా వచ్చిందంటూ బాధితులు చెప్పారు. 1942వ సంవత్సరంలో తమ పూర్వీకులు హైదరాబాద్ టెన్నరీస్ సంస్థను ఏర్పాటు చేసి అక్కడే నివాసం ఉన్నారన్నారు. ఇంటి నెంబర్లతోపాటు ఎలక్ట్రిసిటి బిల్స్, టాక్స్‌లను సైతం రెగ్యులర్‌గా జీహెచ్‌ఎంసీకి చెల్లిస్తున్నామన్నారు. కాగా అధికారులు మాత్రం ఇందుకు విరుద్ధంగా కూల్చివేతలు చేశారన్నారు. బాధితులు సదరు భూమికి సంబంధించి ఆధారాలు చూపకుండా, హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను పరిగణలోకి తీసుకోకుండా ఇండ్లను కూల్చివేయడం రాక్షస పాలనకు నిదర్శనమంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News