మన తెలంగాణ/మాదాపూర్: మాదాపూర్ తుమ్మిడి కుంట చెరువులో అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు శ నివారం 200 మంది పోలీసుల భారీ బందోబ స్తు మధ్య జిహెచ్‌ఎంసి, హైడ్రా సిబ్బంది తో క లిసి కూల్చివేశారు. శేరిలింగంపల్లి మం డల మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానామెట్ సర్వే నెంబర్ 36లో తుమ్మడి కుంట చె రువు 20.07 ఎకరాలో ఉంది. సినీ హీరో అక్కినేని నాగార్జున తుమ్మిడి కుంట చెరువు ఎఫ్‌టిఎల్ స్థలం కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేశారని హైడ్రాకు ఫిర్యాదు రావ డం దానిపై మం త్రి కోమటిరెడ్డి స్పందించి హైడ్రా పరిశీలనకు పంపారు. విచారణ జరిపిన హైడ్రా అది అక్రమమని తేల్చి కూల్చివేశారు. కాగా తుమ్మిడి కుంట చెరువును 3. 30 ఎకరాల స్థలం కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ అక్రమంగా నిర్మాణం చేపట్టారని ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి జనం కోసం అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి గత మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు.
హైడ్రా ఏర్పడినప్పటి నుంచి నగరంలో భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేశారు. చెరువులు, నాలాలు, కబ్జా చేసి చెరువులో, నాలాలలో, ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ స్థలాలో అక్రమంగా భారీ భవనాలు నిర్మాణం చేస్తున్న వాటిపై హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుంది. మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ తుమ్మిడి కుంట చెరువులో 3.30 గుంటల స్థలాన్ని కబ్జా చేసిందని గుర్తించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు శనివారం ఉదయం 6 గంటలకు మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు రంగం సిద్ధ చేసుకొని వచ్చారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, 200మంది పోలీసుల సహయంతో భారీ బందోబస్తు మధ్య ఉదయం కూల్చివేతలు ప్రారంభించారు. శిల్పారామం ముందు, జెఎన్‌టియు రోడ్డు తోపాటు ఎన్ కన్వెన్షన్ చుట్టూ భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకొని ఎవరికి అనుమతించకుండా పెద్ద పెద్ద క్రేన్‌లు, జెసిబిలు కటింగ్ మిషన్‌లు, జెసిబిల సహాయంతో ఎన్ కన్వెన్షన్ పూర్తిగా కూల్చివేశారు. చెరువుకు అనుకుని నిర్మించిన ప్రహరీ గోడ, రేలింగ్‌లతో పాటు కన్వెన్షన్‌ను పూర్తిగా యంత్రాలు, మిషన్‌ల సహాయంతో కూల్చివేశారు.
ఎఫ్‌టిఎల్‌లో నిర్మించిన షెడ్‌ల కూల్చివేత…..
తుమ్మిడి కుంట చెరువుకు చుట్టు ప్రక్కల ఎఫ్‌టిఎల్‌లో నిర్మించిన షెడ్‌లను గుర్తించి కూల్చివేశారు. మిని చార్మినార్ ప్రక్క నుండి తుమ్మిడి చెరువుకు వెళ్లే దారిలో చెరువుకు అనుకొని ఎఫ్‌టిఎల్‌లో కొంత మంది వ్యాపారం నిమిత్తం అక్రమంగా నిర్మించిన షెడ్డులను గుర్తించి జేసిబిల సహాయంతో కూల్చివేశారు. ఫంక్షన్‌లకు, పార్టీలకు ఏర్పాటు చేసే స్టేజి సామగ్రి భద్రపరచడానికి నిర్మించిన రెండు షెడ్‌లను నేలమట్టం చేశారు.
ఎన్ కన్వెన్షన్ ఎఫ్‌టిఎల్‌లోనే ఉంది:
ఇక్కడి నిర్మాణాలకు అనుమతులు లేవు
ఏ కోర్టుల్లోనూ స్టేలు లేవు
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
తుమ్మిడికుంట చెరువు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన ఎన్‌కన్వెన్షన్ యాజమాన్యం పూర్తిగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తూ అధికారిక వ్యవస్థలను తప్పుదోవ పట్టిస్తూ వస్తుందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పేర్కొన్నారు. ఎన్ కన్వెన్షన్ తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టిఎల్ పరిధిలోని ఒక ఎకరం 12 గుంటల భూమిని, బఫర్ జోన్‌లోని 2 ఎకరాల 18 గుంటల భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలను చేపట్టిందని రంగనాథ్ వెల్లడించారు. శనివారం ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణాలను హైడ్రా పూర్తిగా నేలమట్టం చేసింది. అనంతరం ఏవి రంగనాథ్ విడుదల చేసిన ప్రకటనలో ఎన్ కన్వెన్షన్‌లో నిర్మాణాలకు జీహెచ్‌ఎంసి ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. గతంలో బిఆర్‌ఎస్ అమలులో ఉన్నప్పుడు ఇక్కడి నిర్మాణాలను క్రమబద్దీకరించేందుకు ప్రయత్నించగా అధికారులు తిరస్కరించినట్టు తెలిపారు. ఎన్ కన్వెన్షన్‌పై ఎలాంటి స్టేలు ఏ కోర్టులోనూ లేదనీ, 2014లో హెచ్‌ఎండిఏ తుమ్మిడికుంట చెరువుకు ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌ల ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన 2016లో తుదినోటిఫికేషన్‌ను వెలువరింంచింది.
2014లో ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడగానే ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు మాత్రం ఎఫ్‌టిఎల్ నియమాలననుసరించి ఎఫ్‌టిఎల్‌ను ఖరారు చేయాలని వెల్లడించింది. దీంతో అధికారులు తుమ్మిడికుంట చెరువును ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ముందే సర్వేచేసి ఎఫ్‌టిఎల్‌ను నిర్ణయించడంతో సర్వే రిపోర్టుమీద మియాపూర్ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టును కన్వెన్షన్ అధిపతి ఆశ్రయించారు. ఈ కేసు ప్రస్తుతం పెండింగ్ ఉంది. కానీ, ఏ కోర్టులోనూ కన్వెన్షన్‌పై కోర్టు స్టేలు లేవని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న క్రమంలోనే అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నట్టు వివరించారు. అయితే, శనివారం మధ్యాహ్నం ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టు స్టే ఇచ్చినట్టు పేర్కొన్నారు.
అది పట్టా భూమి… చట్ట విరుద్ధమైతే నేనే కూల్చేవాడిని: అక్కినేని నాగార్జున
తుమ్మిడికుంట చెరువు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని కొన్ని వాస్తవాలను తెలిపేందుకు ఈ ప్రకటన చేసినట్లు తెలిపారు. కేసు కోర్టులో ఉ న్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడినని, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే ఆ కూల్చివేతను నేనే నిర్వహించేవాడినని పేర్కొన్నారు.