Wednesday, December 25, 2024

తిరుమలలో గంజాయి కలకలం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తిరుమల కొండపై గంజాయి అక్రమరవాణా కలకలం రేపింది. తితిదే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తిరుమలకు గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. తిరుపతికి చెందిన గంగాద్రి తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని లగేజీ కౌంటర్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఉదయం తిరుపతిలోని అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద బ్యాగుతో అనుమానాస్పదంగా తిరుగుతుండగా, ఎస్ ఈ బి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా అతని వద్ద 15 ప్యాకెట్లలో నింపిన 150 గ్రాముల గంజాయి పట్టుబడింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News