Monday, January 20, 2025

రైల్వే లైన్ ముసుగులో అక్రమ మట్టి రవాణా

- Advertisement -
- Advertisement -

కొండపాక: రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా కొండపాక మండల పరిధిలోని సేలంపు వద్ద మట్టిని ఎత్తి ఆ మట్టిని మరో రైల్వే లైన్ నిర్మాణం జరుగుతున్న చోటుకి పంపిస్తున్న ముసుగులో గుత్తే దారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ అక్రమ మట్టిని దుద్దెడ-రాంపల్లి రోడ్డు పక్కనే ఉన్న ప్రైవేటు భూమిలో టిప్పర్లతో మట్టిని పోసి చదును చేయడం గమనార్హం. ఈ అక్రమ రవాణాను గమనించిన విలేకరులు గుత్తేదారుని ప్రశ్నించగా తమకు అధికారులు మీరు ఎక్కడైనా తరలించుకోవచ్చని చెప్పారని చెప్పడం విడ్డూరం. గత కొన్ని రోజులుగా ఈ తతంగం నడుస్తున్న అధికారులు కన్నెత్తయిన చూడకపోవడం వెనక ఆంతర్యం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈప్పటికైనా అధికారులు అక్రమ మట్టిని తరలించిన వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News