Thursday, January 23, 2025

ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీజ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : ఇంట్లో మద్యం అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తిని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వ్యక్తి ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మలక్‌పేటలోని ఓ వ్యక్తి తన ఇంట్లో భారీగా మద్యం బాటిళ్లను నిల్వ చేశాడని పోలీసులకు సమాచారం వచ్చింది.

వెంటనే రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇంటిపై దాడి చేసి భారీ ఎత్తున మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం చాదర్‌గాట్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News