Monday, December 23, 2024

రూ.12 లక్షల అక్రమ మద్యం పట్టివేత

- Advertisement -
- Advertisement -
  • ఐదుగురి రిమాండ్

ఘట్‌కేసర్: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్ కు తరలించారు. ఘట్కేసర్ (నారపల్లి) ఎక్సైజ్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సిఐ మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం. కరీంనగర్ జిల్లా రాయికల్కు చెందిన తాళ్లపల్లి హరికృష్ణ(43), ఫిర్జాదీగూడకు చెందిన అలగొండ జగదీశ్వర్ (51), వరంగల్ జిల్లా లింగాల ఘనపురం మండలం పండగూడెంకు చెందిన అముదాల సురేందర్ (34), మెదక్ జిల్లా కొండ పాక మండలం, దువాడకు చెందిన.

బుచ్చిగారి శ్రీధర్ (29), బోడుప్పల్ కు చెందిన పున్న బాల్ రాజ్ (53)లు కలిసి గోవా నుండి అక్రమంగా మద్యాన్ని తీసుకువచ్చి నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిన్నారన్న సమాచారంతో పలు చోట్ల దాడులు నిర్వహించి వివిధ రకాల బ్రాండ్లకు చెందిన 581 మద్యం బాటిళ్లు (833 లీటర్లు) రెండు కార్లు, డీసీఎం వాహనం, ద్విచక్ర వాహనం, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన అక్రమం మద్యం విలువ సుమారు రూ. 12 లక్షల ఉంటుందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. నిందితులను అరెసు చేసి రిమాండ్‌కు తరలించి కేసు దర్యాపు చేస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మల్లయ్య తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News