Saturday, December 28, 2024

క‌స్తూర్బా కాలేజీలో గ్యాస్ లీకై.. విద్యార్థినులకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని కస్తూర్బా కళాశాలలో శుక్రవారం గ్యాస్ లీకై విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. తక్షణమే స్పందించిన యాజమాన్యం విద్యార్థినులను ఆసుపత్రికి తరలించారు. దాదాపు పది మంది విద్యార్థులు స్పృహ కోల్పోయినట్లు సమాచారం. విద్యార్థులను అంబులెన్స్ ద్వారా కళాశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News