పటాన్‌చెరు : గురుకుల పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో విద్యార్థినిలకు కోవిడ్ టెస్టు నెగిటివ్ తేలిన వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. ముగ్గురికి తీవ్రంగా ఉండటంతో సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. 25 మందికి ఆర్టీపిసిఆర్ పరీక్షలు చేయాలని వైద్యులు సూచించారు. పటాన్ చెరు పాఠశాలలో ఇప్పటివకే 47 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఇటీవల ఖమ్మం జిల్లా వైరాలోని గురుకుల పాఠశాలలో కరోనా కేసులు వెలుగు చూడగా, తాజాగా పటాన్‌చెరు మండలం ముత్తం గిలోని మహాత్మ జ్యోతిపూలే గురుకుల పాఠశాలలో 42 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది. ఒక విద్యార్థికి స్వల్ప లక్షణాలు ఉండటంతో అనుమానంతో పాఠశాలలో వైద్య పరీక్షలు చేపట్టారు.
గురుకుల పాఠశాలలో ప్రస్తుతం 27 మంది సిబ్బంది, 491మంది విద్యార్థు లు ఉండగా.. ఆదివారం 27 మంది సిబ్బంది, 261 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. వారిలో ఒక ఉపాధ్యాయురాలికి, 42మంది విద్యార్థులకు కరోనా సోకినట్లుగా తేలింది. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి గాయత్రి దేవి ఆధ్వర్యంలో మిగిలిన వారికి సోమవారం పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి ఆదివారం పరీక్షలు పూర్తయ్యాయి. మరో ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. పాఠశాలలోని మొత్తం 48 మంది బాధితు ల్లో ఒక టీచర్, 47 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉండటంతో.. హస్టల్‌లోనే క్వారెంటైన్‌లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు.
గురుకుల పాఠశాలను సందర్శించిన ఉన్నతాధికారులు
గురుకుల పాఠశాలలో కరోనా కేసులు వెలుగుచూడటం తో ఉన్నతాధికారులు సోమవారం ముత్తంగిలోని మహా త్మ జ్యోతిపూలే గురుకుల పాఠశాలను సందర్శించారు. మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బిసి గురుకుల రాష్ట్ర సెక్రటరి మల్లయ్య భట్టు, డిఎంహెచ్‌ఓ గాయత్రి, ఆర్డిఒ నాగేష్, తహశీల్దార్ మహిపాల్ రెడ్డిలు పాఠశాలకు చేరుకొని వైద్యుల పర్యవేక్షణలో కొరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను వైద్యాధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. వసతి గృహంలోనే ఒక్కో గదిలో ఐదు మంది చొప్పున క్వారంటైన్‌లో ఉంచి, విద్యార్థులకు వైద్యసేవలు అందిస్తున్నారు. కొరో నా బారిన పడిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
ఇటీవల మరో గురుకుల పాఠశాలలో కేసులు
ఖమ్మం జిల్లా వైరాలోని గురుకుల పాఠశాల, కళాశాలలో ఇటీవల కరోనా కేసులు వెలుగుచూశాయి. 27 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. ఇటీవల ఇంటికి వెళ్లొచ్చిన ఓ విద్యార్థినికి అస్వస్థతగా ఉండటంతో సిబ్బం ది కరోనా పరీక్షలు చేయించారు. ఫలితాల్లో ఆ విద్యార్థిని కి పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ లక్ష్మి విద్యార్థినులందరికీ పరీక్షలు చేయించగా 27మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. తొలుత 13 మందికి పాజిటివ్ రాగా ఆ తర్వాత మరో 14 మందికి సోకినట్లు వైద్య సిబ్బం ది తెలిపారు. ఫలితంగా కరోనా బారిన పడిన వారందరి నీ ఇళ్లకు పంపించారు. ఈ విషయం తెలిసిన మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా ఇళ్లకు తీసుకెళ్లారు.
తల్లిదండ్రుల్లో ఆందోళన
రాష్ట్రంలో సెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కావడంతో కాస్త భయంతోనే తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడంతో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు అనుమతివ్వడంతో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విద్యార్థులు పాఠశాలలోని వసతి గృహాలకు చేరుకున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో ఒమిక్రాన్ వేరియంట్ కలవరపెడుతోంది. అంతేకాకుండా గురుకులాల్లో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అలా గే రాష్ట్రంలోని పలు స్కూళ్లలోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. ఈ నేపథ్యం లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.