రాంచీ: అక్రమ మైనింగ్ కేసులో తనపై పెట్టిన ఆరోపణలన్నీ సత్య దూరమైనవని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ గురువారం అన్నారు. ఆయన ఈడి కార్యాలయానికి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. “ నేర పరిశోధక సంస్థలు ఓ ముగింపుకు వచ్చే ముందు పూర్తి దర్యాప్తు చేయాలి. బలమైన నిర్ణయానికి రావాలి. నేనో ముఖ్యమంత్రిని, నేనేదో తప్పు చేసినట్లు, దేశం వదిలిపారిపోయే నేరస్థుడిలా సమ్మన్ జారీచేస్తున్నారు” అని తెలిపారు. “నా ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికే కుట్ర జరిగింది. నీట మునిగి ఉన్న జలాంతర్గామి వంటి ఈ కుట్రకి నీటిపైకి వచ్చే బలం లేదు” అని వివరించారు. దీనికి ముందు ఆయన “ కుట్రదారులు తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. వారలా ఎందుకు చేయాలనుకుంటున్నారంటే, మేము ఆదివాసులను బలోపేతం చేస్తున్నామని, వారు బయటి నుంచి వచ్చే వారిని గెంటేస్తారని వారికి తెలుసు” అని చెప్పుకొచ్చారు.
నేను సిఎంను…దేశం వదిలిపోయే వాడిని కాదు: హేమంత్ సోరేన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -