Thursday, January 23, 2025

నేను విఫల రాజకీయ నేత : పవన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలను జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ’ఫేసింగ్ ద ఫ్యూచర్’ అంశంపై సదస్సులో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా సిఎ స్టూడెంట్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. అనేక విషయాలను ప్రస్తావించిన పవన్.. ఈ క్రమంలో ఆయన తన సినీ, రాజకీయ జీవితాన్ని కూడా పంచుకున్నారు.. ఇదే సమయంలో.. తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ని అని వ్యాఖ్యానించారు.

పవన్ ఆ వ్యాఖ్యలు చేయగానే అక్కడున్న సిఎ స్టూడెంట్స్ ఒక్కసారిగా సిఎం.. సిఎం.. అంటూ నినాదాలు చేశారు. అపజయాలను, విజయాలను సమానంగా తీసుకోవాలని, అపజయంలోనే జయం దాగి ఉంటుందని ఆయన చెప్పడంతో విద్యార్థులంతా చప్పట్లతో స్వాగతించారు.

I’m a failure Politician: Pawan Kalyan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News