Friday, November 15, 2024

‘నేను హిందువుని.. హిందుత్వవాదిని కాదు’: కేంద్రంపై రాహుల్ ఫైర్

- Advertisement -
- Advertisement -

జైపూర్: తాను హిందువుని మాత్రమేనని, హిందుత్వవాదిని కాదని రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం జైపూర్ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శించారు. హిందూ, హిందుత్వం అనేవి రెండు ఒకటి కాదని, రెండు వేరేవేరు అని.. దేశం హిందువులదే తప్ప హిందుత్వవాదులది కాదని అన్నారు. మహాత్మ గాంధీ హిందువని, గాడ్సే హిందుత్వవాది అని పేర్కొన్నారు. హిందువు సత్యం కోసం శోధిస్తాడని, కానీ హిందూవాది అధికారం కోసం తపిస్తుంటాడని విమర్శించారు. హిందుత్వవాదుల మార్గం సత్యాగ్రహం కాదని, సత్తాగ్రహం అని ఎద్దేవా చేశారు. 2014 నుంచి హిందుత్వవాదులు అధికారంలో ఉన్నారని, వారిని అధికారం నుంచి తొలగించి హిందువులకు అధికారం కట్టబెట్టాలని రాహుల్ గాంధీ అన్నారు.

I’m Hindu not Hindutvavadi says Rahul Gandhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News