Sunday, January 19, 2025

‘స్పిరిట్’లో నటించడం లేదు: కరీనా కపూర్

- Advertisement -
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ స్పిరిట్ అనే మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి అప్టేడ్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

కానీ, ఇందులో బాలీవుడ్ స్టార్ కపుల్స్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ లు విలన్స్ గా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తపై కరీనా స్పందించారు. తాను ప్రభాస్‌ ‘స్పిరిట్‌’లో నటించడం లేదని స్పష్టం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌, ప్రభాస్‌లపై ప్రశంసలు కురిపించింది. వీళ్లు పాన్‌ ఇండియా ఆడియన్స్‌ ను తమ యాక్టింగ్ మెప్పిస్తున్నారని కరీనా చెప్పుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News