Monday, January 20, 2025

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రాలేను: తారక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో సావనీర్ కమిటీ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలను నిర్వహిస్తోంది. శనివారం సాయంత్రం 5 గంటలకు కూకట్ పల్లిలోని ఖైతలపూర్ మైదానంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ కార్యక్రమానికి తాను రాలేకపోతున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ముందస్తు కార్యక్రమాలు ఉండడంతో తాను ఈ వేడుకల్లో పాల్గొనలేకపోతున్నానని తెలిపారు. ఆహ్వానం ఇచ్చేటప్పుడే కమిటీకి చెప్పినట్లు తారక్ వెల్లడించారు.

కాగా, ఈ కార్యక్రమానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బాబుతోపాటు నందమూరి కుటుంబం, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లుఅర్జున్, రామ్ చరణ్, దగ్గుబాటి రానా, సిద్దూ జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ, నితిన్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పై వెబ్ సైట్, ప్రత్యేక సంచిక ఆవిష్కరించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News