Saturday, December 28, 2024

హేమా కమిటీ రిపోర్టుపై స్పందించిన నటుడు మోహన్ లాల్

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ స్(ఏఎంఎంఏ) అధ్యక్ష పదవికి రాజీనామా చేశాక నటుడు మోహన్ లాల్ శనివారం మొదటిసారి జనం ముందుకు వచ్చారు. కేరళ ప్రభుత్వం హేమా కమిటీ రిపోర్టును విడుదలచేయాలనకుంటున్న నిర్ణయంపై ఆయన మాట్లాడారు.

హేమా కమిటీ కనుగొన్న విషయాల రిపోర్టుపై స్పందిస్తూ ‘‘ మలయాళం సినీ పరిశ్రమలోని ఏ పవర్ గ్రూప్ లోనూ నేను లేను. అలాంటి గ్రూపుందన్న సంగతి కూడా నాకు తెలియదు. తప్పు చేసిన వారిపై సాక్ష్యాధారాలుంటే తప్పక శిక్షించబడాలి’’ అన్నారు.

‘‘దోషులు శిక్షకు గురికానివ్వండి. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాలు తీసుకోనివ్వండి. దయచేసి సినీ పరిశ్రమను నాశనం చేయకండి’’ అని ఆయన వేడుకున్నారు. ‘దృశ్యం’ సినిమా హీరో అయిన ఆయన తాను చాలా బిజీగా ఉన్నానని, తన భార్య కు సర్జరీ జరుగుతున్నందున ఈ సమస్యపై ఇదివరలో వెంటనే స్పందించలేకపోయానని తెలిపారు.

నటుడు మోహన్ లాల్ ‘అమ్మ’ అధ్యక్ష పదవికి ఆగస్టు 27న రాజీనామా చేశారు. జస్టిస్ హేమా కమిటీ లైంగిక వేధింపుల అనేక ఆరోపణలపై వివరాలు కనుగొన్నది. నటుడు సిద్దిఖ్, నిర్మాత రంజిత్ బాలకృష్ణన్ సహా అనేక బడా నటుల పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపింది. దాంతో మోహన్ లాల్ సహా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులంతా తమ రాజీనామాలు సమర్పించారు. హేమా కమిటీని 2017లో మలయాళం సినీ రంగంలో జరిగే అన్యాయాలపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేశారు. 2024 ఆగస్టు 19న హేమా కమిటీ రిపోర్టును కేరళ ప్రభుత్వం విడుదల చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News