Friday, November 22, 2024

పంత్ ఆటపై ‘పిచ్చి’ పట్టింది: గంగూలీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఆటపై తనకు ‘పిచ్చి’పట్టుకుందని బిసిసిఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలి అన్నాడు. అతను నిఖీఆర్సయిన మ్యాచ్ విన్నరని ప్రశంసించాడు. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఆటనూ ఆస్వాదిస్తానని అన్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ బాగా ఆడతారన్నాడు. శార్దూల్ ఠాకూర్ అన్నా ఇష్టమేనని, ఎందుకంటే అతడికి ధైర్యసాహసాలు ఎక్కువని అన్నాడు. నిజానికి బోర్డు అధ్యక్షుడిగా ఎవరు ఇష్టమో చెప్పకూడదని అన్నాడు. ఒక ట్యుటోరియల్ యాప్ ఏర్పాటు చేసిన సెషన్‌లో దాదా మాట్లాడాడు.‘ భారత్‌లో ఎంతో మంది ప్రతిభావంత ఆటగాళ్లు ఉన్నారు. గవాస్కర్ ఆడుతున్నప్పుడు ఆయన తర్వాత ఏమవుతుందోనని అభిమానులు ఆందోళన చెందారు. తర్వాత సచిన్ తెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే వచ్చారు. వాళ్లు వీడ్కోలు పలికాక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌లు బ్యాటన్ అందుకున్నారు. క్రికెట్ పరంగా దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులున్నారు. ఏ తరంలోనైనా ఈ దేశం అత్యుత్తమ క్రికెటర్లను అందించగలదు’ అని గంగూలి ధీమా వ్యక్తం చేశాడు.

I’m Obsessed with Rishabh Pant: Sourav Ganguly

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News