Monday, December 23, 2024

చిరంజీవితో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నాః అమీర్ ఖాన్

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో(తెలుగు) వయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై అమీర్ ఖాన్, కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య నటీనటులుగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారేలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. ఇందులో నాగ చైతన్య బాలరాజుగా కీలక పాత్రలో అమీర్ ఖాన్‌తో కలిసి సైనికుడిగా కనిపిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం విశేషం.

ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని జరిగిన పాత్రికేయుల సమావేశంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగచైతన్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “అమీర్ ఖాన్ ఈ సినిమా ప్రీమియర్ చూడమంటే సుకుమార్, రాజమౌళి, కింగ్ నాగార్జునతో చూశాను. చూసిన తర్వాత తేరుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. అమీర్ ఖాన్ నటన అద్భుతంగా ఉంది. అమీర్ ఖాన్ పాత్రతో పాటు .. చైతన్య పాత్రకు బాగా ఎమోషనల్ అయ్యాను”అని అన్నారు. అమీర్ ఖాన్ మాట్లాడుతూ “ఇదివరకు తెలుగు డబ్బింగ్ సినిమాలకు తక్కువ మార్కెట్ ఉండేది. అయితే ఇప్పుడు తెలుగు సినిమాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా మంచి స్పందన వస్తోంది. అందుకే తెలుగులో మా సినిమాను రిలీజ్ చెయ్యడానికి చిరంజీవిని సంప్రదించాము. చిరంజీవి చిత్రంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. చిరంజీవి నాకు కూడా అవకాశం ఇస్తే నేను తనతో నటించడానికి సిద్ధంగా ఉన్నాను”అని తెలిపారు. అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ ఈ సినిమాలో అమీర్ ఖాన్ లాంటి వారితో నటించడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నానని చెప్పారు.

I’m Ready to Act With Chiranjeevi: Aamir Khan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News