Sunday, December 22, 2024

ముంచుకొస్తున్న మరో తుపాన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :మరో తుపాన్ తెలు గు రాష్ట్రాలపైకి ముంచుకు రాబోతోంది. తెలంగాణ లో మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హె చ్చరించింది. ఈ నెల 5 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని వాయువ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రుతుపవన ద్రోణి జైసల్మే ర్, రైసేన్, చింద్వారా, తూర్పు విదర్భ ప్రాంతంలోను న్న వాయుగుండం కేంద్రం గుండా పొరుగున ఉన్న తెలంగాణ, మచిలీపట్నం మీదుగా వెళ్తుందని తెలిపింది. ఇది ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉందని పేర్కొంది.

మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూ పాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

కామారెడ్డిలో 25.4సెం.మి వర్షం
రాష్ట్రంలో సోమవారం పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. గడిచి 24 గంట ల్లో కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ ర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లా కేం ద్రంలో 25.4, సదాశివ్‌నగర్‌లో 24, నిజామాబాద్ జిల్లా తుంపల్లిలో 22.1 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది.ఉట్నూరులో 167 మి.మి, ఇంద్రవెల్లిలో 146, సిరికొండలో 120, ధర్మపురిలో 122, మేడిపల్లిలో 120, రాయ్‌కల్‌లో 120,మెట్‌పల్లిలో 119, సారంగపూర్‌లో 114,జైనూర్‌లో 178, పాపన్నపేటలో 152, ఆళ్లదుర్గలో 117, శంకరంపేటలో 113, కుల్చారంలో 104, పెంబైలో 145, లక్ష్మణ్‌చందలో 134, నిర్మల్ రూరల్‌లో 123, ఖానాపూర్‌లో 122, సిరికొండలో 172, ముప్‌కల్‌లో 130,మెండోరలో 105, ఎల్లారెడ్డిపేటలో 119, నారాయణపేట్‌లో 147, సిద్దిపేట రూరల్‌లో 146 మి.మి చొప్పున వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News