Sunday, December 22, 2024

తమిళనాడు వర్షబీభత్సాన్ని అంచనా వేయడంలో వైఫల్యం

- Advertisement -
- Advertisement -

డిసెంబర్‌లో దక్షిణ తమిళనాడులో వర్షబీభత్సాన్ని ముందుగా అంచనా వేయడంలో ఐఎండి వైఫల్యాన్ని మొహాపాత్రో అంగీకరించారు. అలాంటి క్లౌడ్‌బర్‌స్ట్ సంఘటనలను, అరుదుగా 60 సెంమీ నుంచి 90 సెంమీ వరకు వర్షం కురిసే సంఘటనలను, అంచనా వేయడంలో ఇప్పటికీ సవాళ్లు ఎదురవుతున్నాయని వివరించారు.

1793లో చెన్నైలో మొదటి ఐఎండి
1793 లో దేశం మొత్తం మీద చెన్నైలో ప్రాథమికంగా ఐఎండి ఏర్పాటైందని, హెన్రీ ఎఫ్ బ్లాన్‌ఫర్డ్ మొదటి ఇంపీరియల్ మెటియొరాలజికల్ రిపోర్టర్‌గా 1875 జనవరి 15న బాధ్యతలు తీసుకున్నారని వివరించారు. 1864లో రెండు బీభత్స తుపాన్లు సంభవించి 80,000 మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు వాణిజ్యనౌకలు సముద్రంలో మునిగిపోయాయని చెప్పారు. ఆ తరువాత దుర్భిక్ష పరిస్థితులు ఎదురయ్యాయని,

వీటన్నిటివల్ల బ్రిటిష్ పాలకులు భారత వాతావరణ శాఖను ఏర్పాటు చేయడానికి దారి తీసిందన్నారు. దేశం ప్రగతి పథంలో రానురాను ముందుకు సాగుతుండడంతో వాతావరఱణ అంచనాలో కచ్చితత్వం గత ఐదేళ్లలో 40 నుంచి 50 శాతం అంతకు ముందు ఐదేళ్ల కన్నా పెరిగిందని తెలిపారు. రానున్న కాలంలో అన్ని రకాల అసాధారణ వాతావరణ సంఘటనలను అంచనా వేయగలుగుతామని మొహాపాత్ర వివరించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News