ముంబై: తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతం, గోవా, కోస్తా కర్ణాటక, కేరళలో అక్కడక్కడ భారీ మొదలుకొని అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ముంబై, థానేలలో శుక్రవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తన ఐదు రోజుల అంచనాలో పేర్కొంది. మంగళవారం ఉదయం 8.30 గంటలతో ముగిసిన 24 గంటల్లో కోలాబా , శాంటాక్రూజ్ అబ్జర్వేటరీలు రెండూ వరుసగా మూడు అంకెలలో 117 మిమీ మరియు 124 మిమీ వర్షపాతం నమోదయ్యాయి. మంగళవారం కూడా మొత్తం కొంకణ్ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది.
మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురియొచ్చని వాతావరణ శాఖ ముంబైకి ‘ఆరెంజ్ అలర్ట్’ జారీచేసింది. ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. ముంబైలో అయితే వాన నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారింది. థానే జిల్లాలో ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో తిరుగాడటం ప్రజలకు కష్టంగా మారింది. సియోన్, చెంబూర్, బాంద్రా, ఎయిర్ ఇండియా కాలనీ, కుర్లా, తదితర ప్రాంతాల్లో వాన నీరు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ప్రజలు, బస్సులు వేరే రూట్ల గుండా వెళ్లాల్సి వస్తోంది.
#WATCH | Maharashtra: Sion area of Mumbai reels under severe waterlogging amidst heavy rainfall lashing the city. pic.twitter.com/3tpGXQlh0w
— ANI (@ANI) July 5, 2022