Friday, December 27, 2024

చిందెయ్యనున్న చినుకు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో ఈసారి వర్షపాతం సాధారణ కన్నా ఎక్కువగానే ఉంటుంది. 2024 వర్షాకాల వాతావరణం, ఎటువంటి స్థాయిలో వర్షాలు పడుతాయనే విషయాన్ని భారత వాతావరణ విభాగం (ఐఎండి) సోమవారం ప్రకటించింది. లానినా పరిస్థితులు ఆగస్టు సెప్టెంబర్ నాటికి తలెత్తుతాయి. వాతావరణ సానుకూల సంకేతాలతో ఈసారి వర్షపాతం మొత్తం మీద ఆశాజనకంగా ఉంటుందని ఐఎండి సంచాలకులు మృత్యుంజయ మెహాపాత్ర విశ్లేషించారు. అయితే దేశవ్యాప్తంగా సార్వత్రికంగా ఒకే విధమైన వర్షపాతం నమోదు అవుతుందనని చెప్పడం కుదరదని ఐఎండి తెలిపింది.. దీనికి సంబంధించి ఇప్పటికైతే గ్యారంటీ ఇవ్వడం కుదరదని వివరించారు.

వాతావరణ మార్పుల పరిణామంలో ఎక్కడ ఏ స్థాయిలో వర్షాలు పడుతాయనేది నిర్థారించడానికి వీల్లేదని తెలిపారు. అన్నింటికి మించి ప్రపంచవ్యాప్త పరిణామాలతో ఇప్పుడు వర్షాల రోజులు తగ్గుతున్నాయి. ఇంతకు ముందటిలాగా వర్షాకాలం అంతా కూడా పూర్తిస్థాయిలో వర్షాలతో వర్షాకాలంగా ఉండటం లేదు. మధ్యలో వర్షాలకు విరామాలు, వాతావరణం వేడిమి వంటి పరిణామాలకు దారితీస్తోంది. వర్షాలు కురిసే రోజులు తగ్గుముఖం పట్ట డం, మరో వైపు తక్కువ దశలో భారీ వర్షాల పరిణామాలతో ఇతరత్రాప్రకృతి వైపరీత్యాలు వరదలు లేదా కరువులకు దారితీస్తోంది. ఎల్ నినో ప రిణామం తరువాత వచ్చే లా నినా దశలో భారతదేశంలో వర్షాలు సాధారణం కన్నా ఎక్కువగానే ఉంటున్నాయి. 1951 నుంచి 2023 వరకూ ల భ్యమైన డాటాను పరిశీలిస్తే భారతదేశంలో ఈ లా నినా పరిస్థితి మేలు చేసింది.

ఈ విధంగా తొమ్మిది సార్లు దేశంలో సంతృప్తికరంగా వానలు పడ్డాయి. జూన్ తొలకరి మొదలుకుని సెప్టెంబర్ వరకూ సాగే వర్షాకాల సీజన్ దేశానికి అత్యంత కీలకమైనది. ప్రత్యేకించి వ్యవసాయ రంగానికి ఇది ఊపిరి అవుతుంది. ఈ సారి వర్షాకాలంలో మొత్తం మీద వర్షపాతం లాంగ్ పీరియడ్ సగటు అయిన 87 సెంటిమీటర్ల లెక్కన చూస్తే 106 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్ల మెహాపాత్ర తెలిపారు. ఇప్పటికైతే ఓ మోస్తరు ఎల్ నినో పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రుతువపనాల ఆగమనం నాటికి ఈ పరిణామంలో తటస్థత ఏర్పడుతుంది. పైగా ఉత్తరధృవంలో మంచుమేటలు తక్కువగా ఉంటాయి. క్రమేపీ ఆ తరువాత ప్రయోజనకర లా నినా పరిస్థితి ఏర్పడుతుందని, ఇది నైరుతి రుతుపవనాలకు ఆశాజనకం అవుతుందని మెహాపాత్ర తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News