Friday, December 27, 2024

ఉరుములు మెరుపులతో వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల 24గంటల్లో తూర్పు ఈశాన్య జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.దిగువ స్థాయిలో గాలులు పశ్చిమ వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నట్టు తెలిపింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశాలు ఉన్నట్టు ఐఎండి తెలిపింది.గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని పలుప్రాంతాలలో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.

పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 47.8 మి.మి వర్షం కురిసింది. నాగుల వంచలో 37.3, మణుగూరులో 35.8, దుమ్ముగూడెంలో 32.3, రావినూతలలో 31.3, మల్కారంలో 27, మందలపల్లిలో 26.8, ఏటూరు నాగారంలో 25.5, అంకంపాలెంలో 25.3, నాగుపల్లిలో 24.5, కర్కగూడెంలో 24.3, గంగారంలో 23, అశ్వరావుపేటలో 22.3, మహాదేవపూర్‌లో 19.3 మి.మి చోప్పున వర్షం కురిసింది. రాష్ట్రంలొని మిగిలిన మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలిక పాటి వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News