Monday, December 23, 2024

రాగల మూడు రోజుల్లో భారీ వానలు

- Advertisement -
- Advertisement -
ఆంధ్ర, ఒడిశాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
మే 7 నుంచి 9 మధ్య తూర్పు తీరాన్ని తాకనున్న మోచా తుఫాను

న్యూఢిల్లీ: రాగల మూడు రోజుల్లో మోచా తుఫాను రానున్నదని, దాని ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక మోస్తరు నుంచి భారీ వానలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండి) తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడనున్నాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిమీ. వేగంతో ఈదురు గాలులు వీచనున్నాయని తెలిపింది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, ఎఎస్‌ఆర్, అనకాపల్లి, ఏలూరు, ఉభయ గోదావరి, ఎన్‌టిఆర్, గుంటూరు, కృష్ణ, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో వానలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో గాలి స్థిరంగా లేకపోవడం వల్ల ఈ వానలు పడనున్నాయి. గాలి ఆంధ్రప్రదేశ్‌ను సమీపిస్తోంది. ఒడిశాలోని 18 జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ‘మోచా తుఫాను’ హెచ్చరికలు జారీ చేసింది. భువనేశ్వర్‌లో ఉన్న వాతావరణ శాఖ అయితే బాలాసోర్, భద్రక్, జజ్‌పుర్, కేంద్రపాడ, కటక్, పూరీ సహా ఒడిశాలోని వివిధ జిల్లాలకు ఎల్లో నోటీసు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News