మన తెలంగాణ/హైదరాబాద్ :తెలుగు రాష్ట్రా ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భా రత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజు ల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయ ని పేర్కొంది.తెలంగాణపై క్యుములో నింబస్ మేఘాలు ఆవరించి ఉన్నట్టు తెలిపింది.హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, శంకర్‌పల్లి ప్రాంతాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉం దని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పా టు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వ ర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వే సింది. నైరుతి బంగాళాఖాతంలో ఈనెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.ఇది మే 24నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పే ర్కొంది. మారిన వాతవరణ పరిస్థితుల ప్రభావంతో ఈ నెల 23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వే సింది. కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ అ ధికారులు వెల్లడించారు. హైదరాబాద్ సహా ప లు ప్రాంతాల్లో ని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని అధికారులు సూచించారు.
దీంతో పా టు వర్షాలుకురిసే సమయాల్లో ప్ర యాణాలు చేసే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉం డాలని సూ చించారు. ఇదిలా ఉంటే శనివారం మధ్యా హ్నం నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతా ల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాం తాల్లోని రోడ్లు వర్షపునీటితో నిండిపోయి చెరువులను తలపించాయి. ఇంకోవైపు ట్రాఫిక్ జా మ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందు లు పడ్డా రు. తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 24వరకూ వ ర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షి ణ చత్తీస్‌గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకూ కొనసాగిన ఆవర్తనం దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి తెలంగా ణ ,రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకూ సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మి ఎత్తులో కొనసాగుతోంది. మరో వైపు రాయలసీమ పరిసర పరిసర ఉత్తర తమిళనాడు ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి. మి ఎత్తులో కేంద్రీకృతమైవున్న చక్రవాతపు ఆవర్తనం శనివారం బలహీనపడింది. దీని ప్రభావంతో రాగల 24గంటల్లో ఒక మోస్తరు నుంచి అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు ,మెరుపులు గంటకు 50కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
19జిల్లాలకు ఎల్లో అలర్ట్
మారుతున్న వాతవరణ పరిస్థితుల నేపధ్యంలో ఆదివారం రాష్ట్రంలోని 19 జిల్లాలకు ఎల్లో అల ర్ట్ ప్రకటించింది. అదిలాబాద్ , కొమరంభీమ్, మించిర్యాల,పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి,
హైదరాబాద్ , మేడ్చెల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ ,నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
శేరిలింగంపల్లిలో 68.8 మి.మి వర్షం
రాష్ట్రంలోని పలు జిలాలలతోపాటు హైదరాబాద్‌లో శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. కోన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. ఉప్పల్, వనస్థలిపురం,శేరిలింగంపల్లి, ఎల్‌బినగర్, హైదర్‌నగర్, చందానగర్, మియాపూర్, అల్విన్‌కాలనీ, మేడ్చల్, కండ్లకొయ, దుండిగల్ తదితర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. గంటకు 40కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచాయి. వనస్థలిపురం జాతీయ రహదారిపై భారీగా వరదనీరు చేరడంతో ఆ ప్రాంతం చెరువును తలపించింది. ఫనామా, ఎల్‌బినగర్ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని శేరిలింగంపల్లిలో 68.8 మి.మి వర్షం కురిసింది. కట్టంగూర్‌లో 65.5,నడిగూడెంలో 63, తొమ్మిడిరేకులలో 58, హయత్‌నగర్‌లో 56.8, కడ్తాల్‌లో 55, శకంర్‌పల్లిలో 50.3, ఉప్పల్‌లో 47.7 ,రామచంద్రాపురంలో 46, మఠంపల్లిలో 44.3, సరూర్‌నగర్‌లో 41.8 ,మల్కాజిగిరిలో 38.8 మి.మి చొప్పున వర్షం కురిసింది. రాష్ట్రంలో మొత్తం 201 కేంద్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు నుంచి వర్షం కురిసింది. కాగా రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రత అత్యధికంగా కొత్తగూడెంలో 40.1డిగ్రీలు నమోదయ్యాయి.