Sunday, December 22, 2024

రానున్న 48 గంటలలో భారీ, అతి భారీ వర్ష సూచన

- Advertisement -
- Advertisement -

రానున్న 48 గంటల్లో భారీ, అతి భారీ వర్షాలు కురుస్తున్నాయన్న హైదరాబాద్ వాతావరణ శాఖ (రెడ్-టెక్-యాక్షన్) చేసిన సూచనలతో తెలంగాణా రాష్ట్ర నీటి పారుదల శాఖా అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖా ఇంజినీర్ జి.అనిల్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటిపారుదల శాఖాధికారులతో ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను ఫోన్ లలో సమీక్షించారు. శుక్రవారం ఉదయం నుండి ఆయన ఇ.ఎన్.సి.,సి.ఇ, యస్.ఇ, ఇ.ఇలతో మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్తలపై తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేశారు. విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకుని భద్రతా చర్యల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

రిజర్వాయర్లు,కాలువలు,నీటి మట్టాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూనే స్పిల్ వే లు,వరద గేట్లు సక్రమంగా పని చేస్తున్నాయో లేదో తెలుసుకోవాలన్నారు.అత్యయక పరిస్థితులు ఏర్పడితే ఎటువంటి నష్టం వాటిల్ల కుండా అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని అనిల్ కుమార్ ఆదేశించారు. అదే సమయంలో నీటి మట్టాలు, ప్రవాహం ఉధృతి ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారం తెలుసుకోవాలని ఆయన సూచించారు. అంతే గాకుండా అత్యాయక పరిస్థితుల సమాచారం అప్పటికప్పుడే కంట్రోల్ రూమ్ కు అందించాలని ఇ.ఎన్.సి అనిల్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News