ఉత్తర పశ్చిమ బెంగాల్ పరిసర ఈశాన్య ఝార్ఖండ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం వాయువ్యమధ్య ప్రదేశ్‌పైన ప్రస్పుటమైన అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్రమట్టానికిపైన 7.6కి.మి వరకు విస్తరించివుంది.వీటిప్రభావంతో రాగల 24గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని అంచనా వేసింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ వనపర్తి, నారాయణపేటలో పలుచోట్ల గంటకు 30-నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.