Friday, December 27, 2024

పొంచి ఉన్న అల్పపీడనం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మరో అల్పపీడనం పొంచుకొస్తోంది. ఉపరి తల ఆవర్తనం తూర్పు మద్య బంగాళాఖాతం మీద సగటు సముద్ర మట్టం నుండి 4.5 కి.మి నుండి 7.6 కి.మి ఎత్తు మధ్యలో ఉంది. ఇది ఎత్తుకు వెళుతున్న కొలది దక్షిణం వైపునకు వంగి ఉంది .దీని ప్రభావంతో ఈ నెల 18వ తేది నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దిగువ స్థాయిలో గాలులు పశ్చిమ ,వాయువ్య దిశలనుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. రాగల రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.ఈ నెల 19నుండి 20 వరకూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల,పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ ,వరంగల్ ,హన్మకొండ,జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.ఈ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. కొత్తగూడెంలో 27మి.మి, లక్ష్మిదేవిపల్లిలో 24.5, నాయుడుపేట 19.8, కోటపల్లిలో 18, మణుగూరులో 17.5, చెన్నూరులో 16.3,ఖానాపూర్‌లో 15.8, నీల్వాయ్‌లో 15.5 రఘునాధపాళెంలో 15.3,ఖమ్మంలో 14.3 మి.మి చొప్పున వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News