తెలంగాణలో ఈ నెలాఖరు వరకూ ఒక మోస్తరు నుంచి అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఈ నెల 29 నాటికి తూర్పు మధ్య, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉందని, ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని పేర్కొంది.రాష్ట్రంలో మంగళవారం నాడు ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
27న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. 28న ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో వానలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 29, 30 తేదీల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ మేరకు వాతావరణశాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.