హైదరాబాద్: ప్రపంచంలోని అత్యుత్తమ స్మార్ట్ సిటీస్ జాబితా ఐఎండి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌ను ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్(ఐఎండి) విడుదల చేసింది. సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్(ఎస్‌యుటిడి) సహకారంతో దీన్ని ఐఎండి రూపొందించింది. ఆరోగ్యం, భద్రత, రవాణా సదుపాయాలు, కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు, విద్యా వ్యవస్థ, పరిపాలనఅనే ఐదు అంశాలలో ఆయా నగరాలు సాధించిన ప్రగతి ఆధారంగా అత్యుత్తమ స్మార్ట్ సిటీసీ జాబితాను 2023 సంవత్సరానికి గాను ఐఎండి రూపొందించింది.
ఈ ఏడాది కూడా స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ నగరం స్మార్ట్ సిటీస్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. 2019 నుంచి జూరిచ్ ఇదే స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియాలోని క్యానెబెర్ర, సింగపూర్ మినహా మిగిలిన టాప్ 10 స్మార్ట్ సిటీస్ అన్నీ యూరపులోనే ఉండడం విశేషం.
ప్రపంచంలోని టాప్ 10 స్మార్ట్ సిటీస్ జాబితా:
1. జూరిచ్ (స్విట్జర్లాండ్).
2. ఓస్లో(నార్వే)
3. క్యాన్‌బెర్రా(ఆస్ట్రేలియా)
4. కోపెన్‌హేజెన్(డెన్మార్క్)
5. లాసన్నె(స్విట్జర్లాండ్)
6. లండన్(యునైటెడ్ కింగ్‌డమ్)
7. సింగపూర్
8. హెల్‌సింకి(ఫిన్‌ల్యాండ్)
9. జెనీవా(స్విట్జర్లాండ్)
10 స్టాక్‌హోమ్(స్వీడన్)
స్మార్ట్ సిటీస్ జాబితాలో హైదరాబాద్‌కు చోటు:
భారతదేశానికి చెందిన స్మార్ట్ సిటీస్ జాబితాలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ జాబితాలో ఢిల్లీ ర్యాంకు 105 కాగా ముంబై ర్యాంకు 109. ఇండియన్ స్మార్ట్ సిటీస్‌లో హైదరాబాద్‌కు నాలుగవ స్థానం దక్కింది. ప్రపంచ జాబితాలో హైదరాబాద్ నంబర్ 116గా ఉంది. ప్రపంచ స్మార్ట్ సిటీస్ జాబితాలో మొత్తం 141 నగరాలు ఉన్నాయి. భారత్ స్మార్ట్ సిటీస్‌లో బెంగళూరుకు మూడవ స్థానం దక్కింది.