Thursday, January 23, 2025

ఎల్‌నినోను అధిగమించి సాధారణ వర్షపాతం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ ఏడాది రుతుపవనాల ప్రభావపు నాలుగునెలల వర్షాకాలం దశ ముగిసింది. మొత్తం మీద సగటున సాధారణ వర్షపాతంతో ఈ సీజన్ పూర్తి అయిందని భారత వాతావరణ పరిశోధనా సంస్థ (ఐఎండి) శనివారం ప్రకటించింది. నిజానికి ప్రతికూల ఎల్‌నినో ప్రభావం ఎదురైంది. కానీ దీనిని సానుకూలవాతావరణ పరిస్థితులు అధిగమించాయి. దీనితో సాధారణ వర్షపాత రికార్డు నెలకొంది. ఈ వర్షాకాలంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం నిర్ణీతంగా 868.6 మిమీలు ఉండాలి. ఈసారి 820 మిమీలుగా నమోదైందని ఐఎండి తెలిపింది.

లాంగ్ పీరియడ్ ఎవరేజ్ (ఎల్‌పిఎ)లో 94 శాతం నుంచి 106 శాతం మధ్య వర్షపాతం ఉంటే దీనిని సాధారణ స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. ముగిసిన వర్షాకాల వర్షపాతం ఇతర వివరాల గురించి ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మెహాపాత్ర విలేకరుల సమావేశంలో తెలిపారు. సాధారణ వర్షపాతం ఇప్పటి పరిణామం అని వివరించారు.ఈసారి వర్షాకాలంలో పలు విధాలైన వ్యత్యాసాలు నెలకొన్నాయి. కుండపోత వానలు, తరువాతి స్థితిలో పెరిగిన ఉష్ణోగ్రతలు వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. పలు సహజపరిణామాలతో భారతదేశ వర్షాకాలంపై పలు రకాలుగా ప్రభావం పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News