Saturday, December 21, 2024

తెలంగాణలో ఉరుములు మెరుపులతో వర్షాలు: ఐఎండి హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో రాగల 24గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కిందిస్థాయిలో గాలులు తూర్పు ,ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంవైపునకు వీస్తున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.గురువారం కూడా రాష్ట్రంలో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మద్దుకూరులో 84మి.మి వర్షం కురిసింది . నాగులవంచలో 49.5, అలుబాకలో 42, కొత్తగూడలో 39, మాడుగుల పల్లిలో 33, సిరిపురంలో 28, రెడ్లవాడలో 28, నందనంలో 25, తిమ్మాపూర్‌లో 23, దొండపాడులో 23, పెద్దగోప్తిలో 22, రాజోలిలో 21, జూలూరుపాడులో20, సంగెంలో 19, నేలకోండపల్లిలో 19, రఘునాథపాలెంలో 18, మండ్లపల్లిలో 16, తూగర్రిలో 16, బురాన్‌పల్లిలో 15 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రాష్ట్రంలోని మిగిలిన మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి జల్లులు పడ్డాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News