Saturday, November 23, 2024

తెలంగాణలో శని, ఆదివారాల్లో వడగండ్ల వానలు: ఐఎండి హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంటీరియర్ తమిళనాడు నుండి రాయలసీమ , ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా విదర్భ వరకూ ద్రోణి సగటు సముద్ర మట్టానికి 09కి.మి ఎత్తున కొనసాగుతోంది. ఒక ఉపరి తల ఆవర్తనం రాయలసమీ పరిసర ప్రాంతాల్లో సగుటు సముద్ర మట్టానికి 1.5కి.మి ఎత్తున కొనసాగుతోంది. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రానున్న 48గంటల్లో ఉరుములు , మెరుపులు గంటకు 40కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రానున్న ఐదు రోజులకు వెదర్ బులిటిన్ విడుదల చేసింది.శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని అదిలాబాద్ ,కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్ ,నిజామాబాద్, జగిత్యాల , రాజన్న సిరిసిల్ల ,కరీనంగర్ , పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు , మెరుపులు, గంటకు 40కి.మి వేగంతో బలమైన ఈదరుగాలులతో కూడిన వర్షాలు, వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు ,మెరుపులులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి ములుగు , భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ నెల 27న రాష్ట్రంలోని మరికొన్ని జల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఆ తర్వాత రెండు రోజులు పెద్ద మార్పు లేదని తెలిపింది.
రాగల 24గంటలల్లో …
రాగల 24గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని ఐఎండి తెలిపింది. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గరిష్ట , కనిష్ణ ఉష్ణొగ్రతలు వరుసగా 34డిగ్రీలు, 24డిగ్రీలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఆగ్నేయ దిశల నుండి గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఆ తరువాత 48గంటలు సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశనుంచి గాలులు గంటకు 8కి.మి వేగంతో వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News